vijay Leo movie review

Admin

Updated on:

LEO MOVIE VIJAY

VIJAY LEO MOVIE REVIEW

చిత్రం: లియో

నటీనటులు: విజయ్ త్రిష అర్జున్ సంజయ్ దత్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ ,మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ ప్రియా ఆనంద్ మాథ్యూ థామస్ శాండీ మాస్టర్ బాబు ఆంటోనీ తదితరులు నటించారు

దర్శకత్వం: లోకేష్ కనగ రాజు

సంగీతం :అనిరుద్ రవిచందర్

నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్

విడుదల :19/ 10/ 2023

 

VIJAY LATEST MOVIE LEO COLLECTION

దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరియు విజయ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం లియో

ఖైదీ విక్రమ్ చిత్రాలతో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ .

విజయ్ మరియు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

అదే కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం లియో మరొకసారి ప్రేక్షకులు ముందు వచ్చింది.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స ఎల్ సి యు లో భాగంగా ఈ సినిమా ఉంటుంది ఈ విషయం తెలిసిన అభిమానుల్లో లియో పై ఉన్న అంచనాలను మరింత పెంచింది మరి ఈ దసరాకు విడుదలైన లియోచిత్రం..

ఆ భారీ అంచనాలను అందుకుందా విజయ్ లోకేష్ కాంబినేషన్ మరొక్కసారి అభిమానులకు నచ్చిందా?

ఇదిలా ఉంటే పార్టీ అలియాస్ పార్టీ అనే క్యారెక్టర్ లో విజయ్ నటించారు హిమాచల్ ప్రదేశ్ స్థిరపడిన తెలుగువాడు ఒక కేఫ్ నడుపుకుంటూ 20 ఏళ్లుగా అక్కడే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు అతని భార్య సత్య త్రిష వీరిద్దరిదీ ప్రేమ వివాహం.
వీరికి ఒక బాబు పాప హాయిగా సంతోషం సాగిపోతున్న సమయంలో విజయ్ జీవితం ఒక క్రిమినల్ ముఠా వల్ల తలకిందులవుతుంది. ఆ దొంగల ముఠా ఒకరోజు రాత్రి విజయ్ నడిపిస్తున్న కేఫ్ లోకి వచ్చి డబ్బులు దోచుకెళ్లే ప్రయత్నం చేసినా ఆ ముఠాని హీరో అక్కడికక్కడే కాల్చి చంపేస్తాడు. దీంతోవ పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో పెడతారు అయితే ఆత్మ రక్షణ కోసమే తను వాళ్ళని చంపినట్లు కోర్టులో తేలడంతో నిర్దోషిగా విడుదలవుతాడు . అక్కడితో   ఆగిపోలేదు పార్టీని ఒక దినపత్రిక ఫోటో వేస్తుంది అది చూసిన ఆంటోనీ దాస్ సంజయ్ దత్ గ్యాంగ్ విజయ్ వెతికి పట్టుకొని చంపేందుకు హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరుతారు.

దీనికి ఇంకొక కారణం ఏంటంటే 20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఆటో నీ కొడుకు లియోల భారతివాన్ ఉండటమే ఈ కథకు ట్విస్ట్. అసలు లియో ఎవరు ,పార్తి బన్
లియో ఒక్కరేనా లేదా అన్నదమ్ముల? సొంత కొడుకుని చంపాలని ఇటు లియో తండ్రి ఆంటోనీ అతని అన్న హెరాల్డ్ దాస్
అర్జున్ ప్రయత్నిస్తుంటారు దీనికి గల కారణాలు ఏంటి అనేది ప్రేక్షకులు సినిమాలో చూసి తెలుసుకోవాలి.
ఉత్కంఠంగా సాగుతున్న సమయంలో ఎల్సీయూలో భాగంగా వచ్చిన ఖైదీ విక్రమ్ తో ఈ సినిమాకు పెద్దగా లింకు ఉండదు. ఈ కథ వాటికి సంబంధం లేకుండా ఉంటుంది కాకపోతే ఆఖరిలో విక్రమ్ గా కమల్ హాసన్ లియోతో ఫోన్ మాట్లాడటం వంటి అంశాలే ఇది ఆ సినిమాకు భాగంగా అనిపించేలా కనిపిస్తుంది అది తప్ప మిగతా సినిమాలో ఎక్కడా దానికి సంబంధించిన స్టోరీ గానీ లింకులు గానీ ఉండవు.

అయితే ఒక క్రిమినల్ ముఠా కలెక్టర్ ను హత్య చేసి తప్పించుకున్న ఎపిసోడ్తో సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించారు దర్శకుడు లోకేష్ కనగరాజు ఆ తర్వాత హై నాతో తలపడే ఒక యాక్షన్ సీక్వెన్స్ తో న్ విజయ్ పాత్రని పరిచయం చేస్తారు ఈ ఎపిసోడ్ వల్ల ఫస్ట్ అఫ్ బాగుంటుంది.

తర్వాత కుటుంబం భార్య పిల్లలు తర్వాత వచ్చిన పరిస్థితులను చూపిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లడంతో ఈ కథ కొంచెం నెమ్మదిగా సాగుతున్నట్లు ప్రేక్షకులు కనిపిస్తుంది.

ఆ తర్వాత మళ్లీ ఏ విధంగా కదా ఆసక్తి రేకెత్తిందో తెరపై చూడాల్సిందే మాటల్లో చెప్పలేం ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ సంజయ్ దత్ అర్జున్ వారి వారి పాత్రలో అద్భుతంగా నటించారు ముఖ్యంగా సంజయ్ దత్ విజయ్ మధ్య వచ్చే చేజింగ్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది మరి పార్తిబన్ లియో ఒక్కర లేదా ఇద్దరు అనే పాయింట్ చుట్టూ సెకండ్ హాఫ్ ఉంటుంది .

లియోపాత్ర గతం తండ్రి అన్నతో వైరం ఏర్పడడానికి కారణం అంత ఆసక్తికరంగా అనిపించదు అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాత్రం అద్భుతంగా ఉంటాయి.

కాకపోతే దర్శకుడు  లోకేష్ కనగరాజ్ కథ చిత్రంలో ఉన్నంత క్లైమాక్స్ మెరుపు ఈ చిత్ర ముగింపులో ఉండదు.. కానీ దృష్టి కోణంలో ఈ చిత్రం స్టాండర్డ్స్ విషయంలో చాలా అద్భుతంగా చిత్రీకరించారు అలాగే మన సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది .

ఈ సినిమాని పూర్తిగా ధియేటర్లోనే ఎంజాయ్ చేయగలుగుతాం కాబట్టి సగటు ప్రేక్షకుడిగా ఈ సినిమాను అందరూ థియేటర్లో చూస్తే బాగుంటుంది.

అందులో ఉన్న ఫీల్ ని ఎంజాయ్ చేయగలుగుతాం.
గమనిక: ఈ సినిమా చూసిన నాకు కలిగిన అనుభూతిని నీకు వివరించాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

ఇదిలా ఉంటే ఈ దసరా కానుకగా విడుదలైన లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ తొమ్మిది రోజుల్లో 500 కోట్లు రాబట్టిందిగా అంచనా
.