Venky Mama on stage in World Cup cricket match

Admin

Venky Mama on stage in World Cup cricket match

వరల్డ్ కప్ వేదికలో వెంకీ మామ

ఈరోజు జరిగిన ప్రపంచ క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ మరియు భారత్ క్రికెట్ మ్యాచ్ లో మన తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ గారు కొద్దిసేపు కామెంట్రీ బాక్స్ లో అలరించారు.
ఈరోజు జరిగిన ఇంగ్లాండ్ మరియు భారత్ మ్యాచ్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ ఈ ప్రపంచ ప్ భారత్ కచ్చితంగా గెలుస్తుంది అని అలాగే న్యూజిలాండ్ మరియు భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగవచ్చునని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా గతంలో జరిగిన ప్రపంచకప్లో ధోనితో పంచుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

అంతేకాకుండా మన విరాట్ కోహ్లీ శ్రీలంక జరిగే మ్యాచ్లో సెంచరీ కొట్టి సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను సమం చేస్తాడని ప్రెడిక్ట్ కూడా చేశాడు.

అలాగే మ్యాచ్ విజయం అనంతరం గ్రౌండ్లో మాట్లాడుతూ ఈ ప్రపంచకప్ సీజన్లో విజయం భారతదేనని ఈరోజు జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ అద్భుతమైన అలాగే బౌలర్లు అందరూ చాలా చక్కగా ఆడారు అని అభిమానులతో పంచుకున్నారు

మన తెలుగు హీరోలలో సీనియర్ నటుడైన విక్టరీ వెంకటేష్ గారు క్రికెట్ పై ఉన్న అభిమానంతో మన భారత్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా సాధ్యమైనంత వరకు వెళ్లి తిలకిస్తూ ఉంటారు. ఈరోజు వెంకటేష్ గారు చెప్పినట్టు మన టీమిండియా 12 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ ని అందుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టీమిండియా..