Vaisshnav Tej aadi Keshava trailer release

Admin

Updated on:

aadi keshava movie trailer

Vaisshnav Tej Aadi Keshava Trailer And Release Date

నేను అయోధ్యలో ఉండే రామున్ని కాదప్ప ఆ రావణుడు కొలిచే రుద్ర కాలేశ్వరుడిని

ఉప్పెన ఫేమ్ వైష్ణవ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ అండ్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ఆదికేశవ.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను అత్యంత సాంకేతిక విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందిస్తున్నారు. ఆది కేశవ ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది .

ఈ సినిమా కి సంబంధించి తాజా ట్రైలర్ ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

పంజా వైష్ణవ తేజ్ నాల్గవ సినిమా ఆదికేశవ ఈపాటికి విడుదలై ఉండాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యింది అని సమాచారం,ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ సినిమా ఈ నవంబర్ 24 వ తేదీన రిలీజ్ కాబోతోంది, ఇందులో భాగంగా ఆదికేశవ మూవీ టీం ప్రమోషన్స్ డోస్ పెంచింది,

కొత్తగా విడుదలైన ట్రైలర్ విషయానికి వస్తే వైష్ణవ తేజ్ శ్రీ లీల మధ్య కెమిస్ట్రీ అలాగే కామెడీ సెంటిమెంట్ యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా చూపించారు రాధిక శరత్ కుమార్ తన కొడుకు పై ఉండే నమ్మకాన్ని కనబరుస్తున్నట్లు నా పెద్ద కొడుకు న్యాయం చేయాలంటే డాక్టర్ అనే పదవి కావాలి కానీ నా చిన్న కొడుకు న్యాయం చేయడానికి ఎదుటివారు సమస్య ఉందంటే చాలు అని డైలాగ్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది, అలాగే రాముడు లంకపై పడితే ఎలా ఉంటుందో చూశారు కానీ రావణాసురుడు అయోధ్య పై పడితే ఎలా ఉంటుందో చూపిస్తా,

నేను అయోధ్యలో ఉండే రామున్ని కాదప్ప, ఆ రావణుడు కొలిచే రుద్ర కాలేశ్వరుడిని. అనే డైలాగ్ ఆది కేశవుడిని వంటి డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి, ఈ ట్రైలర్ మొత్తం చూసినట్లయితే లవ్ టచ్ కనిపిస్తూ యాక్షన్స్ అన్ని వేశాలతో మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉంటుంది.

వైష్ణవ తేజ్   శ్రీ లీల జంట ఆకర్షణీయంగా కనిపిస్తుంది అలాగే వైష్ణవ తేజ్ ఈ సినిమాలో రంగస్థలంలో రామ్ చరణ్ ని గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.

మరి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం.

 ఆది కేశవ ట్రైలర్ చూడాలనుకుంటే ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి