ustaad bhagat sing movie update

Admin

Updated on:

ustaad bhagatsing movie update

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరి శంకర్ కాంబినేషన్లో రాబోవు తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ .

2016 లో విడుదలైన తమిళ్ సినిమా తేరి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, చేకూరి మోహన్ ఈ సినిమాకు నిర్మాతలు

దర్శకత్వం: హరి శంకర్
నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రీ లీల, సాక్షి వైద్య, అశుతోష్ రానా, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు,
అలాగే నవాబ్షా, బిఎస్ అవినాష్, గౌతమి చమ్మక్ చంద్ర, గిరి నాగ మహేష్, నర్రా శ్రీను, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పోస్టరు సెప్టెంబర్ 2న విడుదల చేశారు.

PAWAN KALYAN UPCOMING MOVIE

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త అతని నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలయింది,

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదే క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి, ఒకవైపు రాజకీయాల్లో బిజీ అయినా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా చురుకుగానే తీస్తున్నారు సాధ్యమైనంత త్వరగా సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్రొడక్షన్ టీం ఆశిస్తున్నారు.

ఒకపక్క ఈ సినిమా కోసం ఫ్రీ ప్రొడక్షన్ పై సినిమాటోగ్రాఫర్ అయినంక బోస్, ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి, డైరెక్టర్ హరి శంకర్, వారి పనిలో బిజీగా ఉన్నారు,

150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు అంచనా.

రాజకీయాల్లో వెళ్లిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్  ఖాతాలో హ్యాట్రిక్ విజయాలను అందుకుని. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి విజయవంతమైన సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

మరోపక్క గతంలో తీసిన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ హరి శంకర్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు.. దేవి శ్రీ ప్రసాద్  గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలైన జల్సా, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు మంచి మ్యూజిక్ అందించి సినిమాల విజయంలో కీలక పాత్ర వహించిన విషయం  తెలిసిందే.

ustaad bhagatsing glimbs