Tiger 3 Movie Review

Admin

Updated on:

Salman Khan Tiger3 Movie Review|

Tiger3 Movie Tollywood Latest Movie Update

బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ సరికొత్త సినిమా టైగర్ త్రీ అంటూ ప్రేక్షకులు ముందుకు దీపావళి ఫైరింగ్ సందడి చేయడానికి వచ్చాడు,
టైగర్ సిరీస్ లో మూడో భాగంతో  టైగర్ త్రీ    సల్మాన్ ఖాన్& కత్రినా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన  సినిమా .

ప్రపంచ వ్యాప్తంగా 9500 స్క్రీన్లలో బాలీవుడ్ సినిమా రికార్డు స్థాయిలో రెండవ స్థానంలో విడుదలైన సినిమా టైగర్ 3 మరి అంచనాలను అందుకుందా లేదా తెలుసుకుందాం

గతంలో విడుదల అయిన ఎక్జా టైగర్ మరియు టైగర్,జిందా హై సినిమాల సీక్వెల్ గా YRS SPY UNIVARSE  భాగంగా టైగర్ 3 చిత్రం రూపుదిద్దుకుంది
చిత్రంలోని కథ అంశాలు తెలుసుకుందాం.

ఒక రా ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ టైగర్( సల్మాన్ ఖాన్) కి మాజీ ఐఎస్ఐ ఏజెంట్  కి ఏదో గొడవలో ఉన్నాడని తెలియజేస్తాడు కానీ  రెహ్మాన్(ఇమ్రాన్ హష్మీ) టైగర్ కంటే రెండు అడుగులు ముందు ఉన్నాడు మరియు టైగర్ ను ఆపడానికి అతను గట్టి ప్లాన్ తో వస్తాడు అప్పుడు టైగర్ ఏం చేశాడు ఇంతకీ అతి రెహమాన్ ఏం సాధించాలనుకున్నాడు ఈ మిషన్ జోయా కత్రినా కైఫ్ టైగర్ కి ఎలా సహాయం చేస్తుంది ఇదే ఈ సినిమా లోని అంశాలు

 

ప్లస్ పాయింట్స్:

సినిమా ఓ ఆసక్తికరమైన అంశంతో మొదలవుతుంది మొదట కొన్ని నిమిషాలు ఉత్కంఠ బరమైన ట్విస్టులతో ముందుకు సాగుతుంది సెకండాఫ్ ప్రేక్షకులకు కొన్ని మంచి క్షణాలను అందిస్తుంది, వై ఆర్ ఎఫ్ పై యూనివర్సిటీ నుండి కొన్ని పాత్రలు సెకండాఫ్ లో కనిపిస్తాయి మరియు వాటి యాక్షన్ సన్నివేశాలు కూడా చక్కగా చూపించారు

సల్మాన్ ఖాన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో చాలా బాగా నటించాడు, మరియు అతను చాలా నమ్మకంతో యాక్షన్ బ్లాక్ లను చేస్తాడు. సల్మాన్ ఖాన్ క్రేజీకి తగ్గట్టుగానే అతని ఎంట్రీ సీన్ చాలా బాగా డిజైన్ చేశారు, అలాగే సల్మాన్ ఖాన్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ల మధ్య కాంబో సీన్స్ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఈ ఇద్దరు పెద్ద స్టార్   ను ఒకే ఫ్రేమ్‌లో కలిసి చూడటం విజువల్ వండర్ ట్రీట్ గా ఉంటుంది, షారుక్ ఖాన్ ఎంట్రీ సీన్ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు, అది ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని కూడా నింపుతుంది షారుఖాన్ యొక్క funny చేష్టలు కాసేపు వినోదాన్ని అందిస్తాయి మరియు మొత్తం యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా చిత్రీకరించబడింది.
కత్రినా కైఫ్ జోయాగా పంచులు వేసింది మరియు ఆమె కొంచెం కూడా నిరాశపరచలేదు ఆమె అద్భుతమైన రీతిలో విన్యాసాలు కూడా చేస్తుంది. ఆమె స్క్రీన్ ప్రజెంట్ చాలా అద్భుతంగా ఉంది సిమ్రాన్ కీలక పాత్రలో నటించింది.
 
 
మైనస్ పాయింట్స్:
 
 
ఉత్కంఠ బరితంగా మొదలయ్యే కథ తర్వాత ఆ ఉత్కంఠ ని కొనసాగింపు కోల్పోతుంది ఫస్టాఫ్‌లో చాలా వరకు అస్పష్టమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి టైగర్ త్రీ యొక్క ఫ్రేమ్స్ భారతీయ ప్రేక్షకులకు  అంతగా సరిపోకపోవచ్చు , గత చిత్రాల మాదిరి కథలో గొప్పగా కథాంశం ఏమీ లేదు అలాగే వాటిలో పండిన వినోదం దురదృష్టవశాత్తు టైగర్ త్రీ లో పెద్దగా వినోదాత్మక అంశాలు కూడా లేవు
మరో ముఖ్యమైన లోపం ఏంటి అంటే పాత్రలు సరిగా వ్రాయబడలేదు  ఇమ్రాన్ హష్మీ
 నిస్సందేహంగా మంచి కళాకారుడు కానీ అతను పాత్ర కు సరిగ్గా సరిపోలేదు, అంతేకాకుండా రొటీన్ స్టోరీ ఇకనుంచి అయినా ఫిలిం మేకర్స్ విభిన్నమైన చిత్రాలతో ముందుకు వస్తే మంచిది.
VFX  విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా కుదరలేదని చెప్పాలి ప్రేక్షకులను విసుగు పుట్టించే విజువల్స్ అసహనాన్ని కలిగిస్తాయి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సరిపోలేదు
అలాగే పాటలు కూడా అనుకున్న రీతిలో లేవు ఇంత పెద్ద స్టార్ హీరో సినిమా టైగర్ 3 కి మెరుగైన సౌండ్ ట్రాక్‌లు కూడా చాలా అవసరం
ఓం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఎడిటింగ్ బాగుంది విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన అంతవరకు మేకర్స్ మీద మంచి నిర్ణయాలు తీసుకుని ఉంటే బాగుండేది.
దర్శకుడు మనీష్ శర్మ విషయానికి వస్తే సినిమా బిట్స్ అండ్ పీస్ గా మాత్రమే పనిచేయడంతో అతను పూర్తి న్యాయం చేయలేకపోయాడు ఆదిత్య చోప్రా అందించిన కథలో కొత్తదనం లేదు శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే సరైన విధంగా కుదరలేదు.
 
మొత్తానికి టైగర్ త్రీ పార్ట్‌లలో మాత్రమే ఎంటర్టైన్ చేయడంతో పూర్తి హైపున అందుకోలేకపోయింది .
 
సల్మాన్ ఖాన్ నటన చాలా బాగుంది మరియు సల్మాన్ ఖాన్ మరియు షారుక్ ఖాన్ మధ్య జరిగే సన్నివేశాల సమయంలో చిత్రం ఆకర్షణీయంగా మారుతుంది తక్కువ బస్టాప్ తర్వాత సెకండ్ ఆఫ్ కొంచెం బాగుంది అనిపిస్తుంది కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది .
 
 
Note :ఇది మా విశ్లేషణ మాత్రమే సగటు ప్రేక్షకుడికి ఉండే అభిరుచుల ప్రకారం వారికి ఇంకో విధంగా అర్థం కావచ్చు కేవలం మా అభిప్రాయం మాత్రమే మీకు అందిస్తున్నాం
.
.