Tiger Nageswara Rao Telugu Movie Review

Admin

Updated on:

Tiger Nageswara Rao Telugu Movie Review

చిత్రం: టైగర్ నాగేశ్వరరావు
నటీనటులు:
 వితేజ, అనుపమ కేర్, నుకూర్ సనన్, రేణు దేశాయ్ జిసుసేన్ గుప్తా, మురళి శర్మ, గాయత్రి భరద్వాజ్, నాజర్ తదితరులు

సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఆర్ మది
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
రచన సంభాషణలు: శ్రీకాంత్ విస్స
దర్శకత్వం: వంశీ

 

దర్శకుడు వంశీ దర్శకత్వంలో రవితేజ తొలిసారిగా నటించిన.. తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు
ఈ చిత్రం నాగేశ్వరరావు అనే స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది,

వరుస సినిమాలలో నటిస్తున్న రవితేజ ఈ ఏడాది దసరాబరిలో టైగర్ నాగేశ్వరరావు తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.
ఈ చిత్రం యొక్క కథ 1970,80 దశకంలో స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు పేరు వింటే చాలు అటు ప్రజల్లోనూ ఎటు పోలీసులను ఒక రకమైన అలజడి మొదలయ్యేది దోపిడీలకు పెట్టింది పేరైన నాగేశ్వరరావు కన్ను పడింది అంటే చాలు ఎంత విలువైనదైనా ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న చెప్పి మరి దొంగతనం చేస్తాడని పేరు అటువంటి నాగేశ్వరరావు దొంగతనాలు చేసే ప్రాంతాన్ని టైగర్ జోన్ అని టైగర్ నాగేశ్వరరావు అని పిలిచేవారు, ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో అతని గురించి కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు అతను ఒక పేరు మోసిన దొంగ ఈ కథతో రూపొందించిన చిత్రమే టైగర్ నాగేశ్వరరావు.

.టైటిల్ పాత్రలో రవితేజ అద్భుతంగా నటించారు 1980 నేపథ్యంలో కథ మొదలవుతూ ఆంధ్ర ప్రదేశ్ లోని స్టువర్టుపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గురించి ఢిల్లీలో చర్చ మొదలవుతుంది ప్రధానమంత్రి భద్రతను సమీక్షించే ఇంటెలిజెన్స్ అధికారి రాజ్ పుత్  స్వయంగా రంగంలోకి దిగి స్టువర్టుపురం గురించి తెలిసిన పోలీస్ అధికారి విశ్వనాథ శాస్త్రి మురళీ శర్మ నీ పిలిపించి నాగేశ్వరరావు గురించి ఆరా తీయడం మొదలుపెడతారు

అందుకు కారణాలు ఏమిటి అసలు ఈ దోపిడీలన్నీ ఎలా పాల్పడుతున్నాడు అసలు నాగేశ్వరరావు యొక్క లక్ష్యం ఏమిటనేది అసలు కథ

బయోపిక్ గా తెరకెక్కుతున్న
 నాగేశ్వరరావు జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల మోతాదే ఎక్కువ గా చిత్రీకరించారు అక్కడక్కడ కొన్ని సినిమాకు కావలసిన సన్నివేశాలు మలుచుకున్నారు దీనికోసం వారి కుటుంబ సభ్యుల నుండి పర్మిషన్ కూడా తీసుకొని చిత్రాన్ని నిర్మించారని ఇండస్ట్రీ వర్గాల ప్రచారం.

ఈ సినిమా ఇంటర్వెల్ వరకు బానే ఉంది అనిపించినప్పటికీ సెకండాఫ్ మాత్రం గాడి తప్పిందని చెప్పాలి. నాగేశ్వరరావు నిజ జీవితంలో జరిగిన దోపిడీలని ఎక్కడా సరిగ్గా చూపించకపోవడం కూడా ఒక లోపం అలాగే నాగేశ్వరరావు ప్రధానమంత్రి సీట్ వరకు వెళ్లాడన్నప్పుడు అతనిలో ధైర్యం మరియు తెలివితేటలు అలాగే సాహసాలు ఉండాలి అలాంటివి ఏమీ సరిగ్గా చిత్రీకరించ లేకపోయారు

ఈ చిత్రం స్టార్టింగ్ లో రైల్లో దోపిడీ చేసిన సంఘటన చూపించారు అది సహజంగా లేనప్పటికీ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో విజువల్స్ మాత్రం చాలా ఆకట్టుకుంటాయి, ఈ చిత్రం ప్రధాన కథ దొంగతనం అనే పాయింట్లోనే మొదలవుతుంది కాబట్టి అసలు దొంగతనాలు ఎందుకు చేయవలసి వచ్చింది వాళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైతే దొంగతనాలకు సన్నద్ధమయ్యారు అనే సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తాయి కానీ వెంటనే సినిమా ఎలిమెంట్స్ కమర్షియల్ ఫార్మాట్ లోకి వెళ్లి పోతుంది అలాగే పోలీసులతో ఫైట్ హీరోయిన్ తో ప్రేమ అంటూ మరో దారి పడుతుంది కథ ద్వితీయార్థంలో అయితే తలలు తెగిపడుతూ  సాగే సన్నివేశాలు ఉంటాయి తప్ప కథ ఎక్కడ ఆసక్తి రేకెత్తించదు..

నటీ నటులు విషయానికొస్తే రవితేజ తన ఎనర్జిటిక్ నటనని ఎప్పటిలాగే ఈ సినిమా కూడా అందించాడు రవితేజ నటన ఈ సినిమాకి పూర్తిగా బలం ప్రతి కమర్షియల్ మూవీస్ లో కనిపించినట్టుగా కాకుండా గత చిత్రాలకి పూర్తిగా భిన్నంగా నాగేశ్వరరావు పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు లుక్ విషయంలోని యాక్షన్స్ సన్నివేశాలలో ఆయన బలమైన ప్రభావం చూపించాడు అలాగే కథానాయకులు సనన్ గాయత్రి భరద్వాజ్ తమ పాత్రలకు సరైన న్యాయం చేయగలిగారు గాయత్రి పాత్ర కాస్త ఎక్కువ సమయం తెరపై కనిపిస్తుంది అనుపమ, కేర్ మురళీ శర్మ, నాజర్ తదితరులు పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు, రేణు దేశాయ్ చేసిన హేమలత లవణం పాత్ర తెరపై ఓ మోస్తరుగా కనిపిస్తుంది మిగతా నటీనటులు కథకనుగుణంగా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు, టెక్నికల్ గా సినిమా ఉన్నతంగానే ఉంటుంది ముఖ్యంగా జీవి ప్రకాష్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తనదైన ప్రభావం చూపించారు

అలాగే ప్రొడక్షన్ కెమెరామెన్ డిజైన్ విభాగాలలో అందరూ మంచి పనితీరును ప్రదర్శించాయి

ఈ చిత్రం బలాలు సినిమా ప్రధమార్ధం అలాగే రవితేజ నటన అలాగే జీవి ప్రకాష్ సంగీతం చాయాగ్రహణం

బలహీనతలు
నాగేశ్వరరావు లాంటి బయోపిక్ అయిన మంచి కథ ఉన్నప్పటికీ ఆసక్తి రేకెత్తించని కథనం
భావోద్వేగాల విషయంలో బలహీనమైనది
చిత్రం యొక్క నిడివి కూడా

ముఖ్య గమనిక ఏంటి అంటే ఈ చిత్రం యొక్క సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించి ఇది పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.. అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు ఎవరి అభిప్రాయం వారిది