SS Rajamouli Biography

Admin

Updated on:

ఎస్ఎస్ రాజమౌళి జీవిత చరిత్ర తెలుగులో

కోడూరి శ్రీశైల రాజమౌళి &రాజమౌళి సతీమణి రమ రాజమౌళి

పూర్తి పేరు :

 కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి

తల్లిదండ్రులు:

 విజయేంద్రప్రసాద్ రాజానందిని

 

బంధువులు :ఎం ఎం కీరవాణి

పిల్లలు :ఇద్దరు

పుట్టిన తేదీ అక్టోబర్ 10 1973
 

ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు మరియు కథ రచయిత అయినటువంటి కోడూరి శ్రీశైల రాజమౌళి ఎస్ ఎస్ రాజమౌళి జక్కన్న అనే పేర్లతో పిలువబడే రాజమౌళి టాప్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరు.

 

ఎస్ ఎస్ రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ మరియు రాజానందిని దంపతులకు జన్మించారు అతను పుట్టిన సమయంలో అతని తల్లిదండ్రులు కర్ణాటకలో ఉండేవారు రాయచూరు జిల్లాలో హైర్ కొట్టినకల్లో రాజమౌళి జన్మించారు.

రాజమౌళి తల్లిదండ్రుల స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్ కొవ్వూరు

బాల్యం విద్యాభ్యాసం

రాజమౌళి చిన్నతనంలో నాలుగో తరగతి వరకు కొవ్వూరులో చదువుకున్నాడు తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు ఏలూరులో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం కొవ్వూరులో చదువుకున్నాడు

ఎస్ ఎస్ రాజమౌళి తన స్కూల్ టైం నుంచే కథలు చెప్పడం పట్ల అభిరుచి పెంచుకున్నాడు తన ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ అతనికి రామాయణం మహాభారతం మరియు భాగవత పురాణాలను చెప్పడం అవి మనసులో కేంద్రీకరించుకుని అదే వయసులోని అతని తండ్రి భారతీయ చారిత్రక వ్యక్తులు మతపరమైన ఇతిహాసాలు మరియు సినిమా రచయితగా పనిచేయడంతో రాజమౌళికి సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది

రాజమౌళి కుటుంబం ముందు ఆస్తిపరులు అయినప్పటికీ రాజమౌళి పదవ వేట వచ్చేసరికి వాళ్ళ ఆస్తి మొత్తం పోగొట్టుకోవడంతో సామాన్య జీవితం గడిపేవారు కుటుంబమంతా కలిసి ఒకే ఇంట్లో ఉండటం అలా అటువంటి వాతావరణంలో ఎదురయ్యే సమస్యలు మరియు ఇబ్బందులు చూసి జీవితంపై మంచి సంకల్పం ఏర్పాటు చేసుకున్నారు.

రాజమౌళి తొలత స్క్రీన్ రైటర్ గా సహనిర్మాతగా అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభంలో పని చేసేవారు ఎస్ఎస్ రాజమౌళి కే రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశారు.

ఎస్ ఎస్ రాజమౌళి టీవీ సీరియల్ శాంతినివాసం ప్రముఖ సీరియల్ కి దర్శకుడుగా ఏడాదిన్నర పాటు పనిచేశారు ఇది ఈటీవీలో ప్రసారమయ్యేది.

2001లో రాజమౌళి కెరియర్ లో తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తన నిర్మాణ సంస్థ కోసం ఒక చలనచిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని అందించారు అంగీకరించి ఆ చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పాటు రాజమౌళి దర్శకత్వం వహించారు.

చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

రాజమౌళి రెండవ చిత్రం సింహాద్రి ఈ చిత్రం కూడా జూనియర్ ఎన్టీఆర్ తో పని చేశారు ఈ చిత్రం కూడా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ హిట్ అవడంతో రాజమౌళికి మరింత కీర్తి సంపాదించి పెట్టింది చిత్రంగా నిలిచిపోయింది.

రాజమౌళి మూడవ చిత్రం సై నాలుగవ చిత్రం చత్రపతి విక్రమార్కుడు యమదొంగ వంటి చిత్రాలతో అపజయం లేని దర్శకుడిగా ముందుకు వెళ్లాడు ఈ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేశాయి అలాగే అత్యధిక వస్తువులను కూడా సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచాయి.

ఆ తర్వాత రాజమౌళి నిర్మించిన ఫాంటసీ యాక్షన్ చిత్రం మగధీర ఈ చిత్రం కూడా అప్పటివరకు విడుదలైన సినిమాల్లో ఆల్ టైం ఇండస్ట్రీగా నిలిచి అత్యధిక వసూళ్లను సాధించింది. అంతేకాకుండా మర్యాద రామన్న,ఈగ బాహుబలి 1, 2 ,ఆర్ .ఆర్ .ఆర్

వంటి చిత్రాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్లు సాధించాయి ముఖ్యంగా బాహుబలి మరియు ఆర్ఆర్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి అత్యధిక వసూళ్లను సంపాదించాయి ఆర్ఆర్ ఆర్ చిత్రంలో తునాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా నామినేట్ అయ్యింది.

ఎస్ రాజమౌళి నెక్స్ట్ దర్శకత్వం వహించే మూవీ మహేష్ బాబుతో కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.