Spark Movie Telugu Review

Admin

Updated on:

Spark Telugu Movie Review

Spark The Life Tollywood Movie News

చిత్రం: స్పార్క్ L.I.F.E

బ్యానర్: డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్

నటి నటులు:విక్రాంత్, మెహ్రీన్ పిరజాడ, ఋక్షర దిల్లోన్, గురు సోమసుందరం, నాజర్,

 వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు

కథ, స్క్రీన్‌ప్లే: విక్రాంత్

సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్

DOP: A R అశోక్ కుమార్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

ఆర్ట్ డైరెక్టర్: ఎస్ రామ్ ప్రసాద్

యాక్షన్: జాగ్వార్ కృష్ణన్

నిర్మాత: లీలా రెడ్డి

దర్శకత్వం: విక్రాంత్

విడుదల తేదీ: నవంబర్ 17, 2023

ఈ కథ వైజాగ్ మరియు హైదరాబాదులో జరిగే సంఘటనలతో ముందుకు సాగుతుంది..

లేక మెహరీన్ కలలోకి ప్రతిరోజు ఒక వ్యక్తి వస్తుంటాడు ఆమె కలలో ఉన్న వ్యక్తిని ప్రేమిస్తూ పెళ్లి చేసుకోవాలనే భావనతో స్నేహితులతో కలిసి అతని కోసం ఎదురుచూస్తూ ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఒకరోజు ఆసుపత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది అతనే కదా నాయకుడు ఆర్య (విక్రాంత్) లేక ఎదిరింట్లోనే ఉంటాడు, అతన్ని లవ్ లో దింపడానికి తనదైన శైలిలో ప్రయత్నం చేస్తుంది కానీ ఆర్య మాత్రం లేక ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు, ఒకపక్క ఈ లవ్ ట్రాక్ నడుస్తుండగా మరోపక్క సిటీలో వరసగా అమ్మాయిలు చనిపోతూ ఉంటారు సడన్గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి శ్రీకాంత్ అయ్యంగర్ ఆరోపిస్తాడు.

పోలీసులు కూడా అతని కోసం గాలింపు చర్యలు చేస్తుంటారు అతడు నగరంలో జరుగుతున్న హత్యలకు కారణాలు ఎవరు అమ్మాయిలు సడన్గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏమిటి? వైజాగ్ కు చెందిన జై ఆర్యగా పేరు మార్చుకుని హైదరాబాద్ కు ఎందుకు వెళ్ళాడు యువతుల మరణాల వెనక ఉన్న రహస్య కారణం ఏమిటి జై ప్రియురాలు అనన్య వృక్షాలు ఎలా చనిపోయింది ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పని చేస్తే డాక్టర్ రుద్ర కు ఉన్న సంబంధం ఏమిటి తదితర విషయాలు తెలవాలంటే సినిమా ధియేటర్ కి వెళ్లి చూడాల్సిందే.


ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ త్రిల్లర్ గా కనిపిస్తూ దానికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా జోడించారు బస్టాప్ లో ఒక పక్క హీరో హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపిస్తూనే మరోపక్క వరస మర్డర్లు చూపిస్తూ సినిమాను ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు హత్యలకు సంబంధించిన సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి లవ్ ట్రాక్ మాత్రం రొటీన్ గానే ఉంటాయి ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్ పై ఆసక్తి పెంచుతుంది ఇక అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది.

నాజర్ గురు మరియు తమిళనాడు సోమసుందరం పాత్రలు మొదలవడంతో కథనం ఆసక్తిగా మారుతుంది.

ఎదుటి మనిషిలో మెదడును కంట్రోల్ చేసే ప్రయోగం సఫలం అయితే జరిగే అనర్ధాలు గురించి ఇందులో చర్చించారు హత్య తో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి క్లైమాక్స్ లో వచ్చేట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి దర్శకుడు ఎంచుకున్న కథ చాలా కొత్తగా అనిపిస్తుంది మరోపక్క గతంలో సూర్య నటించిన సెవెంత్ సెన్స్ సినిమాకి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ కథకు హీరో ఇమేజ్ కూడా తోడైతే ఫలితం ఇంకోలా ఉండేది.

దర్శకుడు హీరో కథానాయకుడు రెండు పాత్రల్లో నటిస్తాడు ఈ మూడు పాత్రలను విక్రాంత్ న్యాయం చేయడానికి తన శక్తి మేర నటించాడు.

కొన్నిచోట్ల నటనలో అనుభవం లేనట్లు ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తుంది. లేక పాత్రలో మెహరీన్ ఒదిగిపోయింది ఇక ప్రియురాలు గా అనన్య వృక్షాలు తనదైన శైలిలో నటించింది తెరపై గ్లామర్ గా కనిపించింది విలన్ గా గురు సోమ సుందరం అద్భుతమైన నటనతో మెప్పించాడు సుహాసిని కూడా ఒక కొత్త పాత్రలో నటించింది.

నాజర్ రాహుల్ రవీంద్ర వెన్నెల కిషోర్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మీద అద్భుతంగా నటించారు సాంకేతిక పరంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది వేషం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకు పర్లేదు అనిపిస్తుంది పాటలు ఓ మాదిరిగా ఉంటాయి సినిమాటోగ్రఫీ బాగుంది ,సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్ గా కనిపిస్తుంది, ఎడిటింగ్ లో లోపాలు నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి

స్పార్క్ ది లైఫ్  కథ యొక్క ప్రాథమిక అంశం ఏమిటి అంటే ఒక సైనిక వైద్యుడు శాస్త్రవేత్త శత్రు రాజ్యాల దళాల మెదడు మరియు ఇంద్రియ శక్తులను మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు ఈ పరిశోధన ప్రాజెక్ట్ పేరు స్పార్క్.

విక్రాంత్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించాడు అయినప్పటికీ అతని ఈ కథ యొక్క అంశాన్ని స్పష్టంగా ప్రేక్షకులకు అందించలేకపోయాడు.