Dunki Movie telugu Review

Admin

Updated on:

Dunki Movie Telugu Review

చిత్రం: డంకీ

నటి నటులు: షారుక్ ఖాన్, తాప్సి, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, దియా మీర్జా, సతీష్ షా, అనిల్ గ్రోవర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఎడిటింగ్: రాజ్ కుమార్ హిరణీ 

దర్శకత్వం: రాజ్ కుమార్ హిరణీ

నిర్మాత :గౌరీకాన్, రాజ్ కుమార్  హిరణీ,జ్యోతి దేశ్ పాండే

రచన :అభిజత్ జోషి, రాజ్ కుమార్ హిరణీ

విడుదల తేదీ: 21-12- 2023.

 

Sharuk Khan Dunki Movie Review

మనసుకు హత్తుకు పోయే చిత్రాలను అందించే దర్శకత్వ ప్రతిభగల రాజ్ కుమార్ హిరానీ ఈ సంవత్సరపు విజయాలలో ప్రథమ స్థానంలో ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం డం .

ఈ సినిమా సారు మనసుకు బాగా దగ్గరైన కదా అని స్వయంగా చెప్పడం మరియు ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి

మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉందో చూద్దాం.

కథ.

పంజాబ్ లోని ఒక స్మాల్ విలేజ్ కి చెందిన వాళ్లు మన్ను( తాప్సి) సుఖి (కౌశల్) బుగ్గు( విక్రమ్ కొచ్చర్) బల్లి (అనిల్ గ్రోవర్) , వీళ్ళు అందరూ వాళ్ల వాళ్ల సమస్యల నుంచి గట్టెక్కడం కోసం వెళ్లడమే లక్ష్యంగా వస్తారు కానీ వీసాలకు తగినంత చదువు మరియు డబ్బు వీరు వద్ద ఉండదు ఈ క్రమంలో ఆ ఊరికి పఠాన్ కోట్ నుంచి జవాన్ హర్ దయాల్ సింగ్ థిల్లాన్ అలియాస్ హార్డీ సింగ్,( షారుఖ్ ఖాన్) ఆ నలుగురితో కలుస్తాడు వాళ్ళ సమస్యలు విని పరిస్థితుల అర్థం చేసుకుని తన చెయ్యగలిగే సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఇందుకోసం రకరకాల ప్రణాళికలు రచిస్తాడు వీసా ఇంటర్వ్యూలో ఎలాగైనా గెలుపొందడం కోసం గులాటి బోమన్ ఇరానీ దగ్గర అందరూ కలిసి ఇంగ్లీష్ నేర్చుకుంటారు కానీ ఆ ఐదుగురిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది మిగిలిన వారు దారులు మూసుకుపోతాయి అయినా సరే అక్రమ మార్గాన డంకీ ట్రావెల్ ఇంగ్లాండులోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటారు ఈ ప్రయాణంలో వాళ్లకు ఎలాంటి సవాలు ఎదురయ్యాయి అన్ని దేశాల సరిహద్దుల్ని ఎలా దాటుకుని వెళ్ళగలిగారు అనేది సినిమాలో చూడాల్సిందే అలాగే వాళ్ళ సమస్యలు ఏంటి తిరిగి సొంత దేశమైన భారత్ కి వచ్చారా లేదా తదితర విషయాలు సినిమాలో చూడాల్సిందే.

ఎలా ఉంది అనుకుంటే… సామాజిక అంశాలతో కూడుకుని మనసుకు హత్తుకునే భావోద్వేగాలు అదే హాస్యంతో కట్టిపడేసే దర్శకుడు రాజకుమార్ ఇరానీ. ఈసారి కూడా ఆ అంశాలకు ఏమాత్రం లోటు రానివ్వకుండా డంకి చిత్రాన్ని తెరకెక్కించారు. సూపర్ స్టార్ షారుక్ ఖాన్ స్థాయి మాస్ కి ఆయన మార్క్ రొమాంటిక్ ఇమేజ్ కి ఏమాత్రం ప్రభావితం కాకుండా తనదైన శైలిలోనే కథని మలిచాడు రాజ్ కుమార్ నవ్విస్తూ హృదయాలను బరువెక్కించే సాహసోపేత డంకి ఇంగ్లాండ్ ప్రయాణంలో ప్రేక్షకుల్ని కూడా తీసుకువెళ్లగలిగారని చెప్పుకోవాలి. మన్ను బొగ్గు బల్లి లా కుటుంబ నేపథ్యాలను ఆ ఊరికి  హర్ది సింగ్ రావడానికి గల కారణాన్ని చూపిస్తూనే సన్నివేశాలని మలిచాడు వాళ్లంతా కలిసి వీసా ప్రయత్నాలు ఇంగ్లీష్ నేర్చుకోవడం మరియు డంకి రూట్లో ఇంగ్లాండ్ కి వెళ్ళాలని నిర్ణయించుకోవడం వంటి సన్నివేశాలతో ప్రధమార్గం సాగుతుంది ఇందులో సుఖీ కథ హృదయాన్ని కదిలిస్తుంది ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు కీలకము వలసదారుల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఎన్ని సాహసాలు చేయాలో వెళ్లాక విదేశాలలో వారి బ్రతుకులు ఎలా ఉంటాయో ఎంత దుర్భరంగా ఉంటాయో కూడా చూపించారు ఇది సినిమాకు ప్రధానంగా ఆకట్టుకునే అంశం వీసా కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఇంగ్లీష్ రాదని తిరస్కరిస్తే పంజాబీ రాకపోయినా ఇక్కడ బతుకుతున్నారు కదా అప్పట్లో మన భాష నేర్చుకునే ఆంగ్లేయులు మన దేశానికి వచ్చారా అంటూ పాత్రలు సంధించే ప్రశ్నలతో ప్రేక్షకుల్లో ఆలోచన తెప్పిస్తారు. అంతేకాకుండా ద్వితీర్థం మొత్తం భావోద్వేగాలే కీలకం హార్డి మన్ను ప్రేమ కథ ఆకట్టుకుంటుంది పతాక స్థాయి సన్నివేశాలను ఆ జంట మధ్య సాగే ప్రేమ నేపథ్యం కంటతడి పెట్టిస్తుంది కథలోని భావోద్వేగాలు మరియు హాస్యం ఆకట్టుకున్న కథనంలో పెద్దగా మ్యాజిక్ కనిపించదు. ప్రేక్షకుడికి కొత్తదనం అనిపించదు ఊహకు తగ్గట్టుగానే సాగే కథ కథనం తర్వాత ఏం జరుగుతుందని ఆసక్తి ఉండదు వలసదారుల్లో సవాళ్ళని పైపైనే స్పృశించినట్టు అనిపిస్తుంది.

నటీనటులు ఎలా చేశారు అంటే. షారుఖ్ ఖాన్ లాంటి మాస్ హీరో అలాగే తను ఈ సంవత్సరంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు పొందిన ఇమేజ్ లో ఉన్న సారుకుని ఒక సున్నితమైన కథలో చూడడం కొంచెం కొత్తగా ఉంటుంది ఆయన నటనని మరో కోణంలో ఆవిష్కరిస్తుంది ఈ చిత్రం మాట తప్పని జవాన్ ఆర్డీసింగ్ పాత్రలో సారు  జీవించేశారు, ప్రధమార్ధంలో ఎంత హుషారుగా కనిపించిన విద్యార్థుల్లో అంత ఎమోషనల్ పండించారు తాప్సి పాత్రకి తగ్గ ఎంపిక అనిపిస్తుంది ఈ చిత్రంలో మన్ను పాత్రలో ఆమె చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తుంది అనిల్ గ్రోవర్ విక్రం కొచ్చర్ కీలకమైన పాత్రలో కనిపించగా వీరంతా ఒకటే అయితే విక్కీ కౌశల్ పాత్ర మరో ఎత్తు పరిధి తక్కువే అయినా కథలో కీలకం ఈ పాత్రలో విక్కి చాలా బాగా నటించారని చెప్పాలి రోమన్ ఇరానీ పంజాబీ ఇంగ్లీష్ ట్యూటర్ గా బాగా చేశారు సాంకేతిక విభాగ విభాగాల్లోనూ సంగీతం కెమెరా విభాగాల్లోనూ మంచి మార్కులు పడ్డాయి లుట్ ఫుట్ గయా అనే ఉషారైన పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది మిగిలిన పాటలు కథలో భాగంగానే కనిపిస్తాయి అమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది కనుక తెల్లాన్ రాసిన ఈ కథలోనే భావోద్వేగాలు ఉండడంతో కథనం పరంగా మరిన్ని మెరుగులు అవసరమేమో అనిపిస్తుంది రాజ్ కుమార్ ఇరానీ దర్శకుడిగా ఎడిటర్ గా మరోసారి తనదైన ముద్ర వేశారు నిర్మాణం ఉన్నతంగా ఉంది. మొత్తంగా చెప్పాలి అంటే

సారు గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం అంతటి విజయాన్ని అందుకోలేదని చెప్పాలి

కథలో కొత్తదనం ఉన్నప్పటికీ పాత్రలు కథనం ప్రేక్షకులకి ఆసక్తికరంగా ఉండకుండా సాఫీగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది ఎమోషనల్ లో కొంచెం కంటతడి పెట్టించే సన్నివేశాలు ఉన్నప్పటికీ కొత్తదనం అనిపించదు.

 

ఈ సినిమా విడుదలకు ముందు నుంచి సవాళ్లను ఎదుర్కొంటూనే వస్తుంది ముఖ్యంగా ఇదే సినిమాతో పాటు విడుదలయ్యే ప్రశాంత్ సలార్ సినిమాకి డంకీ సినిమాకి విడుదల డేట్ అనౌన్స్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కి గురైంది అంతేకాకుండా ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ నిరాశ జనకంగా కనిపించాయి రేపు విడుదలవుతున్న సలార్ చిత్రం ఎఫెక్ట్ కూడా డంకీ కలెక్షన్స్ కి ఉంటుంది అని చెప్పాలి ప్రస్తుతం అందరూ పాన్ ఇండియాలో విడుదల చేస్తున్న తరుణంలో డంకీ సినిమా ఒక్క హిందీలోనే చేశారు ఇది కూడా ఈ చిత్రానికి   కలెక్షన్స్ రాబెట్టడంలో ఒక విధంగా మైనస్ అనే చెప్పాలి.


గమనిక ఇది కేవలం మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మేము చూసే దృష్టి కోణం నుంచే ఈ సమీక్ష అందిస్తున్నాము ఎవరిని ఉద్దేశించి కాదు