Salaar Movie Review

Admin

Updated on:

salaar part.1 review

Salaar Movie Telugu Review

Salaar Review

ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులు అయితే ఎలా ఉంటుందో అదే సలార్

చిత్రం: Salaar: Part 1 – Ceasefire Telugu Review

నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, శరన్ శక్తి, ఈశ్వరి రావ్, శ్రీయ రెడ్డి, జగపతిబాబు, రామచంద్ర, రాజు టిన్ను, ఆనంద్, అభినయ రాజ్ సింగ్, మధు గురుస్వామి, జాకీ మిశ్రా, మంజు, ఝాన్సీ, భజరంగిలోకి, నవీన్ సింగ్ , చందు కానూరి, షరీ భార్గవ. తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. 

ఎప్పుడెప్పుడా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న  సినీ ప్రేక్షకులకు ప్రభాస్ నటించిన సలార్ వచ్చేసింది.

బాహుబలి తర్వాత అంతటి సాలిడ్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కన్నుల పండగ వచ్చేసింది.

కే జి ఎఫ్ ఫిలిం మేకర్స్ లో భాగమైన సలార్ డిసెంబర్ 22న ప్రపంచమంతటా థియేటర్లలో ప్రేక్షకులను అలరించగా,
మరి అత్యంత ఆసక్తికరమైన సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? ప్రభాస్ మరియు ఇతర నటీనటులు ఎంతవరకు మెప్పించారు?  అనే విషయాలు తెలుసుకుందాం

ప్రశాంత్ నీల్ పదేళ్ల క్రితం తనకి ఎంతగానో ఇష్టమైన కథ రాసుకొని దానికి సరైన హీరో కోసం ఎదురుచూస్తుండగా మన రెబల్ స్టార్ ప్రభాస్ ఆ గదికి తగ్గ హీరో అని ఈ సినిమా అతనితోనే చేయాలని దృఢమైన నమ్మకంతో తాను చేసిన కృషికి ఫలితం లభించిందని చెప్పాలి.

కథ

ఈ కథ రాజా మున్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) మరియు దేవా (ప్రభాస్) ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ.

కాన్సర్ అనే సామ్రాజ్యానికి కర్తగా రాజమన్నార్ (జగపతిబాబు) 1000 సంవత్సరాల క్రితం ఏర్పరచుకున్న సామ్రాజ్యం లో
 ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తూ ఉంటారు. అక్కడ కూడా ఇతర రాజ్యాల లాగే కుర్చీ  కోసం కుతంత్రాలు మొదలవుతాయి , ఒకపక్క రాజమన్నార్ నేను బ్రతికుండగానే నా కొడుకు వరదరాజు  మున్నార్ నీ త్వరగా చూడాలి అని తన కోరికని ప్రకటిస్తాడు. రాజ మున్నార్ కొన్ని రోజులు ఆయన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగి వచ్చేలోపు ఖాన్సార్ లో కుతంత్రాలు మొదలుపెట్టేస్తారు అక్కడ పరిస్థితులు అన్నీ మారిపోతాయి కుర్చీ కోసం పోటీ పడడంతో కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకుంటాయి వరదరాజ్ మున్నార్ అంతం చేయాలని ప్రయత్నాలు మొదలవుతాయి , దానికి మిగతా ధరలు సైతం వత్తాసు పలుకుతూ తన సొంత సైన్యాన్ని కూడా సిద్ధం చేసుకుంటారు వరద రాజు తన సైన్యం చిన్ననాటి స్నేహితుడు దేవాన్ని పిలుస్తాడు. ఒక్కడు కొన్ని వందల మంది సైన్యాన్ని ఎలా తెరించాడు? తన ప్రాణ స్నేహితులు వరదరాజు కోసం దేవా ఏం చేసాడు ,

అసలు సలార్ ఎవరు అతని 25 ఏళ్ల పాటు ఎన్నో ఊర్లు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో ఒక మారుమూల పల్లెలో తలదాచుకోవాల్సిన అవసరం ఏమిటి అటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది వీళ్ళ జీవితంలోకి ఆద్య శృతిహాసన్ ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలవాలి అంటే సినిమా థియేటర్లలో చూడాల్సిందే.

ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు మంచి హంగులు ఎలివేషన్స్ ఈ సినిమాకు అందించాడు, కే జి ఎఫ్ వరస సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కూడా తనదైన ప్రత్యేక ముద్ర వేశాడు కథ కంటే కూడా KGF సినిమా లాగే కోలార్ గోల్డ్ ఫీల్స్ అంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని హీరోయిన్ స్టైలిష్ గా తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ఒక ఎమోషన్ తో కట్టిపడేసింది. ఇక్కడ కూడా సరిగ్గా అదే తరహాలో ఖాన్సార్ అనే పేరుతో ఒక కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథని మలిచారు. కాకపోతే ఇందులో ఎలివేషన్స్ కంటే కథకి ధాన్యం ఎక్కువ ఉంది కథలోని డ్రామా కు ప్రాధాన్యమిస్తూ కథను ముందుకు సాగించారు అలాగని హీరోఇజానికి తక్కువేమీ చేయలేదు ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా అవసరమైన మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ని ప్రభాస్ అభిమానులకు నచ్చే విధంగా చూపించారు ప్రస్తుతం మూడు సినిమాలు ఆశించిన ఫలితం లేనందున ప్రేక్షకుల్లోనూ ప్రభాస్ అభిమానుల్లోనూ ఈ సినిమా గురించి అత్యంత ఆశలు పెట్టుకున్నారు అంతే ఆసక్తితో ఎదురు చూశారు దానికి తగ్గట్టుగానే సినిమా ఒక ప్రేక్షకుడికి ఫుల్ మిల్స్ లాగే ఉంటుంది అని చెప్పాలి. సగటు ప్రేక్షకుడి దృష్టి కోణానికి థియేటర్లో ఎక్కడ అసహనమైన ఫీల్ కనిపించదు, ద్వితీయార్థంలో మరింత ఆసక్తి రేకెత్తించేలా డ్రామా ఉండటం ఈ సినిమాకు మరింత కలిసి వచ్చిన అంశం.

నటీనటుల విషయానికి వస్తే. ప్రభాస్ రేంజ్ తగ్గ సినిమా ఇది అని చెప్పాలి ఎందుకంటే ప్రశాంత్ నీల్ అంత చక్కగా ప్రభాస్ ని ఈ సినిమాలో వాడుకున్నాడు చాలా రోజుల తర్వాత ప్రభాస్ అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది అని చెప్పాలి అతను చేసే యాక్షన్ సీన్స్ నిజంగా జరుగుతున్నట్టు అని నమ్మేలా ఉందంటే కారణం అతని కటౌట్ తల్లి మాట జవదాటని కొడుకుగా స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది పోరాట ఘట్టాల్లో ప్రభాస్ కనిపించిన తీరు ఆయన ఈరోయిజం స్టైల్ ఆకట్టుకుంటుంది తనిఖీ మాత్రమే సొంతమైన ఎలివేషన్స్ బాగా డిజైన్ చేశారు ఆ సన్నివేశాలు అంతే అవలీలగా చేశారు ప్రభాస్. శృతిహాసన్ ఈ సినిమాలకు తన పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ సినిమా మొదలులో ఆమె కీలకం పృథ్వీరాజ్ సుకుమారాన్ పాత్ర చాలా బాగా ఆకట్టుకుంది స్నేహితులుగా ప్రభాస్ కి ఆయనకి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది ఈశ్వర్ రావు బాబి సింహ జగపతిబాబు మైండ్ గోపి శ్రీయ రెడ్డి ఝాన్సీ జాన్ విజయ్ తదితరులు వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా నటించారు.
సినిమా ఉన్నతంగా ఉంటుంది ఖాన్సర్ ప్రపంచాన్ని తెరకెక్కించిన తీరు కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. విజయ్ బసురుర్ సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగా  చాలా బాగుంది ఉన్నది మూడు పాటలైనా ప్రేక్షకుల్లో నిలిచిపోయే పాటలుగా ఉంటాయి. ఈ కథలో కూడా కే జి ఎఫ్ లో లాగా అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో ఆ సినిమా గుర్తుకొచ్చినప్పటికీ డ్రామా పండించడంలోనూ ప్రభాస్ కి తగ్గట్టుగా మాస్ యాక్షన్ అంశాలు మేలవించడంలోనూ ప్రశాంతి తనదైన ప్రతిభను చూపించాడు నిర్మాణం కూడా ఉన్నతంగా ఉంది.
 
 పార్ట్ 2 మరింత ఉత్కంఠంగా ఉండేలా ప్రేక్షకుల్లో ఒక అంచనాన్ని రేకెత్తించారు.
 
ముఖ్య గమనిక :ఇది మేము చూసిన దృష్టి కోణాన్ని బట్టి మాకు అర్థమైన తీరును బట్టి మేము అందించిన రివ్యూ ఇది పూర్తిగా మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే