Ravi Teja upcoming Lenin movie  update

Admin

Updated on:

Ravi teja

Ravi Teja Telugu movie lenin update

ప్రయోగాల బరిలో రవితేజ మరో ప్రయత్నం లెనిన్

 మరో ప్రయత్నం లెనిన్

ఇటీవల రవితేజ నటించిన సినిమాలు కమర్షియల్ కు దూరంగా ఉంటూ బయోపిక్ లను యాక్షన్ ఎంటర్టైనర్ లను చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ప్రయోగాల వేటను ఆపలేదు,  రాబోవు చిత్రం ఈగల్ జనవరి సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈగల్ చిత్రం కూడా ఒక రకమైన ప్రయోగమే అలాగే తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ వస్తున్నాయి కానీ వాటిలో ఒక కాంబో మరింత ఆసక్తి రేపుతుంది. కిరణ్ అబ్బవరం కి వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సక్సెస్ఫుల్ మూవీ అందించిన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బురు చెప్పిన స్టోరీ లైన్ ఆసక్తికరంగా ఉండటంతో ఫైనల్ వర్షన్
అయ్యాక మళ్ళీ వింటానని చెప్పారంట, లెనిన్ అనే టైటిల్ తో 1990 బ్యాక్ డ్రాప్ లో నడిచే చాలా డిఫరెంట్   సెట్ అప్ తో కనపడే విధంగా ఉంటుందని సినీ కబురు. అయితే నేరేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో చివరి డిస్కషన్ కనుక వర్కౌట్ అయితే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంటుందని సమాచారం.

LENIN Title పెట్టడం వెనక కూడా చాలా హోంవర్క్ చేసి కథను ఎంచుకున్నారంట, రామ్ చరణ్ రంగస్థలం నుంచి పిరియాడిక్ డ్రామాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రవితేజ లాంటి హీరోలు అలాంటివి చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుందని కాబోలు.

మరి ఈ లెనిన్ ఫైనల్ డిస్కషన్ ఓకే అవుతుందా? ఈ సినిమా తెరకెక్కుతుందా? అసలు లెనిన్ వెనుక ఉన్న సంగతులు తెలియాలి అన్నా కొంతకాలం వేచి ఉండాల్సిందే. అయితే డైరెక్టర్ మురళి కిషోర్ మాత్రం ఈ స్క్రిప్ట్ మీద ఆసక్తితో వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో వర్క్ చేస్తున్న రవితేజ నెక్స్ట్ అనిల్ రావిపూడి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్త కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది గతంలో అనిల్ రావిపూడి రవితేజ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ రాజా ది గ్రేట్ కాంబోను రిపీట్ చేసేందుకు వీళ్ళిద్దరూ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం అయితే ఈ కాంబోకు నిర్మాత ఇంకా డిసైడ్ అవ్వలేదు స్క్రిప్ట్ లాక్ చేసాకే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వస్తుంది, ఇక ఇటీవల విడుదల అయినా టైగర్ నాగేశ్వరరావు అనుకున్న రీతిలో విజయం సాధించలేకపోయినా రాబోయే ఈగల్ చిత్రం మీద మాత్రం మూవీ టీం గట్టి నమ్మకంతో ఉంది బహుశా అందుకనే కాబోలు విపరీతమైన పోటీ ఉన్న కూడా జనవరి 13నే ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.