Ranbir Kapoor Animal movie trailer update

Admin

Updated on:

Ranbir Kapoor Animal Movie Trailer Update

Animal Official Trailer

Animal Movie Telugu Trailer Review

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ మరియు రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ యానిమల్ నెక్స్ట్ మంత్ డిసెంబర్ 1 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసింది.

 ఇందులో భాగంగా మూవీ ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటీవల నందమూరి బాలకృష్ణ పాపులర్ షో అయిన అన్ స్టాపబుల్  లిమిటెడ్ ఎడిషన్ కి మూవీ టీం అందరూ వచ్చి బాలయ్యతో సందడి చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే,

అయితే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్ ఈరోజు సినిమాన అఫీషియల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ 3నిమిషాల 33 సెకండ్లు నిడివి ఉంటుంది. ఇందులో ప్రధానంగా తండ్రి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ షిప్ తో పాటు చిన్నతనంలో తండ్రి కొడుకు దగ్గర ఏ విధంగా ప్రవర్తించాడు అదేవిధంగా రన్బీర్ కపూర్ తన తండ్రి తో రివేంజ్ లాంటి సీన్ అలాగే రష్మిక మందన్నరన్బీర్ కపూర్ మధ్య ఎమోషనల్ వాదాలు తన తండ్రి కి బుల్లెట్ దింపిన వాడి పీక కోస్తా అనే పవర్ఫుల్ డైలాగులు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఈ ట్రైలర్ ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ తన విభిన్నమైన పాత్ర నటన శైలి చాలా ఆసక్తికరంగా ఉంది అంతేకాకుండా ఈ చిత్రం రన్ టైం కూడా 3 గంటల 20 నిమిషాలు ఉంటుందని మేకర్స్ ఇదివరకే సమాచారం అందించారు.

 అలాగే ఒకవేళ అదే రన్ టైం తో నడిస్తే రెండు ఇంటర్వెల్ కావాల్సి వస్తుంది అని ఒకవేళ అదే జరిగితే ఇండియన్ సినీ చరిత్రలో ఫస్ట్ టైం లాంగ్ రన్ టైం గల సినిమా గా  అలాగే రెండు ఇంటర్వెల్ ఉన్న సినిమా గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది,

ఇక ఈ చిత్రంలో సందీప్ రెడ్డి తనదైన శైలిలో రన్బీర్ కపూర్ ని చాలా పవర్ఫుల్ గా చూపించారు.

ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ రష్మిక మందన్న తో పాటు బాబి డియోల్ పృద్వి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు