సంచలనం సృష్టిస్తున్న రాజధాని ఫైల్స్

Admin

Updated on:

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రాజధాని ఫైల్స్ ట్రైలర్

ఒకే ఒక్కడి అహం వేల మంది రైతుల కన్నీరు కోట్ల కుటుంబాల భవిష్యత్తు

రాజధాని ఫైల్స్ అనే టైటిల్ తో సరికొత్త తాజా చిత్రం ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ని మూవీ టీం విడుదల చేశారు ముఖ్యంగా పోస్టర్లో” ఒకే ఒక్కడి అహం వేలాది మంది రైతులకు కన్నీరు కోట్ల కుటుంబాల భవిష్యత్తు “అనే ట్యాగ్ లైన్ తో పోస్టర్ విడుదల చేశారు ఈ చిత్రం పూర్తి గా పొలిటికల్ ఎంటర్టైనర్ డ్రామా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి భూములకు సంబంధించిన రైతులు వారి త్యాగాలు వాళ్ళు పడ్డ కష్టం వాళ్లు కోల్పోయిన భవిష్యత్తు ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం పోరాటం మరియు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది అంటే పంట పండాలంటే నీరు ఎంత అవసరమో ఒక రాష్ట్రానికి రాజధాని కూడా అంతే అవసరం అనే డైలాగు ఎమోషనల్ తో కూడిన భావోద్వేగాలు వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం మరియు సుద్దాల అశోక్ తేజ గేయ రచయిత 

శ్రీమతి హిమబిందు సమర్పణంలో తెలుగు వన్ ప్రొడక్షన్ పథకంపై కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి యువ దర్శకులు భాను దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో తెలుగు సీనియర్ హీరో వినోద్ కుమార్ మరియు సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ కీలక పాత్రలో నటించారు పవన్ మరియు షణ్ముఖ మధు అజయ్ రత్నం అంకిత ఠాకూర్ అమృత చౌదరి కీలక పాత్రలో నటించారు అంతేకాకుండా ముఖ్యంగా 600 మంది రైతులు 100 మంది రైతు పిల్లలు ఈ చిత్రానికి సపోర్ట్ చేసి నటిస్తున్నట్లు సమాచారం

మరోపక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరవుతున్న సమయంలో ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా అపకీర్తి మూట కట్టుకుంది ఈ పొలిటికల్ హీట్ లో ఈ చిత్రం ప్రజలకు తొందరగా చేరుతుంది అనుకోవడంలో సందేహం లేదు ఇందులో భాగంగా ఈరోజు విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ట్రెండ్ అవుతుంది, ముఖ్యంగా ఎనిమిది గంటల్లో 5 మిలియన్ల వ్యూస్ తో ఎటువంటి ప్రమోషన్ లేకుండా విడుదలైన ట్రైలర్ కి ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకుల మద్దతు లభించడంతో మూవీ టీం సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Rajadhani Files Telugu Trailer