Prabhash Biography

Admin

Updated on:

రెబల్ స్టార్ ప్రభాస్ బయోగ్రఫీ

పూర్తి పేరు:ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు

జననం: అక్టోబర్ 23వ తేదీ 1979 సంవత్సరంలో జన్మించాడు

వృత్తి: సినీ నటుడు

తల్లిదండ్రులు: ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు,శివకుమారి

జన్మస్థలం: పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామం

 

బాల్యం మరియు వ్యక్తిగత జీవితం

ప్రముఖ తెలుగు సినీ స్టార్ నటుడు ప్రభాస్ 

తాను ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు శివ కుమారి దంపతులకు ద్వితీయ కుమారుడు 1979 అక్టోబర్ 23న జన్మించాడు. ప్రభాస్  తెలుగు సీనియర్ సినీ నటులలో ఒకరైన కృష్ణంరాజు సోదరుని కుమారుడు, తన విద్యాభ్యాసం డిఎన్ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తి చేశాడు తదుపరి పై చదువుల కోసం హైదరాబాదులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేశారు.

సినీరంగ ప్రవేశం

 

ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ అనే తెలుగు సినిమాతో సినీ జీవితం ప్రారంభించాడు ఈ సినిమా మంచి విజయం సాధించింది 2002 సంవత్సరంలో  సినీజీవితాన్ని ప్రారంభించిన ప్రభాస్ ఒడిదుడుకులు చవిచూస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అయితే తాను నటించిన చిత్రాలలో ప్రభాస్ కి కెరియర్ ప్రారంభంలో వర్షం మరియు చత్రపతి వంటి చిత్రాలు మంచి గుర్తింపు పొందాయి ఆ తర్వాత బిల్లా బుజ్జిగాడు డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి లాంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా తీర్చిదిద్దిన చిత్రం బాహుబలి 1 బాహుబలి 2 అని చెప్పాలి ప్రస్తుతం 2023 డిసెంబర్ 2న విడుదలైన సలార్ చిత్రం భారీ విజయాన్ని అందుకుని 600 కోట్లకు పైగా వసూళ్లను చేసింది. తదుపరి ప్రాజెక్టులు ప్రాజెక్ట్ కే అండ్ స్పిరిట్ వంటి చిత్రాలలో నటించనున్నారు అలాగే సలార్ పార్టు సౌర్యంగా పర్వం చిత్రంలో కూడా నటించనున్నారు.