మరో ట్రైలర్ తో సంచలనం సృష్టిస్తున్న సలార్

Admin

Updated on:

Salaar Movie Part1 Trailer

Salaar Movie Trailer 2

సినీ ప్రేమికులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా సలార్

ఈనెల డిసెంబర్ 22 2023 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సలార్ ప్రమోషన్స్ గురించి అభిమానుల్లో ఆందోళన ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది వీటన్నిటికీ తెరతించే విధంగా ట్రైలర్ని విడుదల చేసింది మూవీ టీం.

ప్రభాస్ అభిమానులు మరియు ప్రశాంత్ నీల్ అభిమానులు ప్రేక్షకులు సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ డిసెంబర్ 22 2023 అద్భుతమైన విడుదల దిశగా దూసుకుపోతుంది ఈ చిత్రాన్ని కే జి ఎఫ్ మూవీ మేకర్స్ నిర్మించగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు, మన టాలీవుడ్ రెబల్ స్టార్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా రూపం దాల్చాడు ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తం అతని అభిమానులు ఉన్నారు. ప్రభాస్ నటించిన సలార్ రెండవ టీజర్ విడుదల చేశారు.

పరిష్యన్ సామ్రాజ్యంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు అనే డైలాగ్ తో మొదలవుతుంది ట్రైలర్

అంటే ప్రభాస్ మీద పృధ్విరాజ్ కి ఉన్న నమ్మకం మనకు సూచిస్తుంది కానీ ఇద్దరి స్నేహితులు యొక్క బలమైన విశ్వాసం ఎలా ఉంటుంది, సుల్తాన్ కావాలనుకుంటే ఏదైనా తెచ్చి ఇచ్చేవాడు వద్దనుకున్నా ఏదైనా అంతం చేసేవాడు అంటే తన స్నేహితుడి కోసం ప్రభాస్ దేనికైనా సిద్ధంగా ఉన్నాడు అది తనకి కావాల్సింది అందించడానికైనా తనకోసం దేనినైనా ఎదిరించడానికైనా అని అర్థమవుతుంది. భారీ గన్స్ తో యాక్షన్ విజువల్స్ ఉత్కంఠంగా ఉన్నాయి ,ముఖ్యంగా ప్రభాస్ పోరాట సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి..

తర్వాత ఏం జరిగిందని ఉత్కంఠ ఉండనే ఉంటుంది అంతేకాకుండా మున్నార్ మొత్తం ఆర్మీ ని గేటు దగ్గరే కాకుండా మొత్తం ఖాన్సర్ ఉండమని ఆదేశిస్తున్నట్టుగా ఉంది. క్యాలిక్యులేటర్ పెట్టుకొని ఖాన్సర్ లో ఏది లెక్క పెట్టుకోలేము అని పృథ్వీరాజ్ డైలాగ్,ఖాన్సర్ ఎరుపెక్కాలా అని ప్రభాస్ డైలాగ్ ప్రేక్షకుల్ని కంఠం కలిగించేలా ఉన్నాయి.

ఖాన్సర్ వల్ల చాలామంది కథలు మారాయి కానీ ఖాన్సర్ కథను మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారడం అనే కథాంశంతో ట్రైలర్ ముగుస్తుంది..

ఈ ఆసక్తికి తెరదించాలి అంటే డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే