ప్రశాంత్ నీల్& ప్రభాస్ మరియు పృధ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సలార్ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదలై బిగ్గెస్ట్ హిట్ సాధించి ఇండియన్ టాప్ టెన్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ లో నిలిచింది సలార్
ఈ సినిమా విడుదలైన తొలి రెండు రోజులలో ప్రపంచవ్యాప్తంగా 295.5 కోట్లకు పైగా వసూలు చేసింది అని సమాచారం ఇంకా రెండు హాలిడేస్ మిగిలి ఉండగానే ఇంతటి బాక్సాఫీస్ ఊచకోత సృష్టించిన సలార్,
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామి కొనసాగిస్తూనే ఉంది తాజాగా మూడవరోజు పూర్తయ్యేసరికి సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 402 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది అని సమాచారం
ఇదిలా ఉండగా ఈ చిత్రం లాంగ్ రన్ లో 1000 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు లేకపోలేదు అని ట్రేడ్ వర్గాల అంచనా