Pawan Kalyan Biography
నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, రాజకీయ నాయకుడు, జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్), కళ్యాణ్ బాబు గా పిలవబడే పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం
పవన్ కళ్యాణ్ ( కొణిదెల కళ్యాణ్ బాబు: 2 సెప్టెంబర్ 1971 ) ఒక భారతీయ నటుడు, రాజకీయ నాయకుడు, చిత్రనిర్మాత, యుద్ధ కళాకారుడు మరియు పరోపకారి, అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు. తన విశిష్టమైన నటనా శైలి మరియు వ్యవహారశైలికి ప్రసిద్ధి చెందాడు, అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు మరియు కల్ట్ ఫాలోయింగ్ ఉన్నారు. భారతీయ చలనచిత్రంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరైన అతను 2013 నుండి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నాడు మరియు ఫిల్మ్‌ఫేర్ అవార్డు, SIIMA అవార్డు, సినీమా అవార్డు మరియు సంతోషం ఫిల్మ్ అవార్డును అందుకున్నాడు. ఆయన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కూడా
కొణిదెల పవన్ కళ్యాణ్
అతని సోదరులు చిరంజీవి నాగేంద్రబాబు వీరిద్దరూ కూడా సినీ నటులు.
సెప్టెంబర్ 2 వ తేదీ 1971 సంవత్సరంలో జన్మించారు.
మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యామిలీ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ కళ్యాణ్ తన విశిష్టమైన నటన శైలి మరియు వ్యవహార శైలి తో ప్రసిద్ధి చెందాడు అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు మరియు కల్టి ఫాలోయింగ్ ఉన్న అభిమానులు ఉన్నారు.
పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే తెలుగు సినిమాతో తన సినీ జీవితం ప్రారంభించాడు, పవన్ కళ్యాణ్ తొలి సినిమాలోని చాతి మీద బండలు పగలగొట్టడం మరియు చేతుల మీద నుండి కార్లతో తొక్కించడం వంటి మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన కలలను రియల్ గా నటించి నటనలో తనదైన శైలిని రూపుదిద్దుకున్నాడు, తరువాత వచ్చిన గోకులంలో సీత 1997లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది
1998లో సుస్వాగతం సినిమాతోనటనలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. అదే సంవత్సరం విడుదలైన తొలిప్రేమ లో తన నటనకు స్టార్ డం నీ సాధించాడు ఆ సంవత్సరం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు,
తరువాత వచ్చిన తమ్ముడు 1999 లో విడుదలై ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డ్ సాధించుకుంది,
ఆ తర్వాత వచ్చిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన బద్రి 2000సంవత్సరంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తనదైన ఒక ట్రేడ్ మార్క్ ట్రెండును సెట్ చేసుకున్నాడు, 2001 సంవత్సరంలో వచ్చిన ఖుషి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సాధించింది.
ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ లో నిర్మించుకున్న సినిమా జానీ2023 ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది, పవన్ కళ్యాణ్ తన కెరీర్లో తొలి పరాజయాన్ని చవిచూసిన సినిమా కూడా ఇదే ,అయితే నటనలో తనదైన శైలిని ముద్రించుకున్న పవన్ కళ్యాణ్ తొలిసారి దర్శకుడుగా పరిచయమైన సినిమా జానీ ఈ సినిమా అపజయం అయినప్పటికీ ఒక్క దర్శకుడిగా తనలో ఉన్న టాలెంట్ ని ప్రేక్షకులకి అభిమానులకి ఇండస్ట్రీలో మేధావులకి ఆశ్చర్యాన్ని కలిగించాడు.
తర్వాత 2004లో గుడుంబా శంకర్ ఇది ఓ మోస్తరుగా నడిచిన పవన్ కళ్యాణ్ మార్క్ సినిమాగా అభిమానులు తీసుకోలేకపోయారు,
తర్వాత బాలు 2005 లో విడుదల అయింది , ఇది కూడా యావరేజ్ టాక్ తో ముగిసింది
2006లో వచ్చిన బంగారం మరియు అన్నవరం కూడా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నాయి ఆ తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ లో వచ్చిన జల్సా 2008 టిక్ టాక్ తో త్రివిక్రమ్ డైలాగ్స్ పవన్ కళ్యాణ్ నటన వీరిద్దరి కాంబినేషన్లో తొలి సినిమా తెరపై చూసాము. ఆ తరువాత వచ్చిన సినిమా 2010 లో కొమురంపులి ఘోరపరాజయం పాలయ్యింది. ఇదే సంవత్సరంలో విడుదలైన తీన్మార్ కూడా మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది,
2011 లో విడుదలైన పంజా మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
తర్వాత హరి శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ తెరపైకి వచ్చింది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ తో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకుంది .
కెమెరామెన్ గంగతో రాంబాబు 2012లో విడుదలై హిట్ టాక్ తో సొంతం చేసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ రేంజ్ హిట్ కాదనే అభిమానుల్లో నిరాశ నెలకొంది, 2013లో విడుదలైన అత్తారింటికి దారేది త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో విడుదలైన రెండవ సినిమా ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుని ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
తర్వాత వచ్చిన గోపాల గోపాల 2015లో విడుదలై మంచి విజయం సాధించింది
, తరువాత విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ 2016మరియు కాటమరాయుడు2017 , అజ్ఞాతవాసి,2018 నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.
మళ్లీ 2021లో కం బ్యాక్ మూవీ గా వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది.
తర్వాత విడుదలైన భీమ్లా నాయక్ 2022సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది, 2023 బ్రో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం తన రాబోయే చిత్రాలు హరిహర వీరమల్లు ,ఓ జి (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) ముస్తాద్ భగత్ సింగ్.
వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌లతో ప్రముఖ తెలుగు సినీ నటుడిగా ,అత్యంత ప్రజాదారణ పొందిన నటుడి గా స్థిరపడ్డాడు.
2008లో, కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు, కానీ అది కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత అతను విడిచిపెట్టాడు. అతను మార్చి 2014 మరియు లో జన సేన పార్టీని స్థాపించాడు) ఆ సమయంలో గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన భారతీయ ప్రముఖ రాజకీయవేత్తగా జాబితా చేయబడ్డాడు. (12) కళ్యాణ్ ఒక ప్రసిద్ధ పరోపకారి మరియు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి శిక్షణ tesukunnadu
ప్రారంభ జీవితం
కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల కొణిదెల వెంకటరావు మరియు అంజనాదేవి దంపతులకు 1968 లేదా 1971 సెప్టెంబర్ 2న జన్మించాడు పవన్ కళ్యాణ్ అన్నయ చిరంజీవి మరియు నాగేంద్రబాబు అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రెజెంటేషన్‌లలో ఒకదానిలో “పవన్” అవార్డును అందుకున్నాడు, అతను 12 సంవత్సరాల వయస్సులో కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు
అన్న కుమారులు నటులు రామ్ చరణ్, వరుణ్ తేజ్ 2
అక్క కుమారులు సాయి ధరమ్ తేజ్ ,వైష్ణవి తేజ్
వ్యక్తిగత జీవితం
కళ్యాణ్ తన సినీ రంగా ప్రవేశం చేసిన తర్వాత 1997లో నందిని వివాహం చేసుకున్నాడు, అభిప్రాయ భేదాలతో తన నుండి విడిపోయాడు
2001లో పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ తో మొదట లివింగ్ రిలేషన్ షిప్ లో సహజీవనం ప్రారంభించాడు వారి ప్రేమకు గుర్తుగా కుమారుడు అఖీరానందన్ 2004లో జన్మించాడు. జూన్ 2007 లో నందిని తనకు విడాకులు ఇవ్వకుండానే మళ్లీ పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ కళ్యాణ్ ఫై కేస్ పెట్టింది దీనిపై కళ్యాణ్ స్పందిస్తూ రేణు దేశాయిని తాను పెళ్లి చేసుకోలేదని సాక్షాధారాలు లేకపోవడంతో విశాఖపట్నంలోని మెజిస్ట్రేట్ కోర్టు అతడి అభియోగాల నుంచి తప్పించిందని పేర్కొంది. ఆ తర్వాత జూలై 2007లో పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దాఖలు చేశారు వారి వివాహం జరిగిన వెంటనే నందిని తనను విడిచిపెట్టిందని దానిని ఆమె న్యాయవాది తిరస్కరించారు. ఆగస్టు 2008లో వారు విడాకులు వన్ టైం సెటిల్మెంట్ గా పవన్ కళ్యాణ్ 25 కోట్లు భరణం చెల్లించి అధికారికంగా విడాకులు తీసుకున్నారు,
2009 లో 8 ఏళ్ల సహజీవనం తర్వాత రేణు దేశాయిని వివాహం చేసుకున్నారు 2010లో కుమార్తె ఆద్య జన్మించింది ఆ తరువాత ఈ జంట 2012లో అధికారిక విడాకులతో విడిపోయారు.
తీన్మార్ చిత్రీకరణ సమయంలో కళ్యాణ్ తన మూడవ భార్య అయిన అన్నా లెజీనవా ను కలుసుకున్నారు రష్యా పౌరు రాలు అయినా తనని సెప్టెంబర్ 2013 హైదరాబాదులోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకున్నారు ఈ దంపతులు కు పోలేనా అనే కుమార్తె ఉంది అంజన పవనోవ అనే కుమారుడు మార్పు శంకర్ పవనోవిచ్ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశానికి ముందే కరాటే లో బ్లాక్ బెల్ట్ మరియు వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు అంతేకాదు తన పుస్తకాలు చదవడంలో అత్యంత ఆసక్తి గల వ్యక్తి.