జెమిని టీవీకి దక్కిన హాయ్ నాన్న సాటిలైట్ హక్కులు

Admin

Updated on:

HI Nanna Movie Latest Update

Nani Upcoming movie Satellite Rights News

యువ డైరెక్టర్ shouryuv మరియు న్యాచురల్ స్టార్ నానికాంబినేషన్లో తెరపై రాబోయే తాజా చిత్రం హాయ్ నాన్నా.

  ఈ చిత్రం వైరా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మోహన్ చెరుకూరి డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మించారు,

ఈ చిత్రంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు, నాని కూతురుగా బేబీKiara Khannaనటిస్తుంది .

అయితే ఇప్పటికే ఈ చిత్రం టీజర్  విడుదలయ్యాక ప్రేక్షకుల నుండి మరియు నాని అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఈ చిత్రం యొక్క రిలీజ్ కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన ప్రసార హక్కుల (శాటిలైట్ హక్కులు) హక్కులపై తాజాగా ఒక నిర్ణయానికి వచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించిన సాటిలైట్ పార్ట్నర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమినీ టీవీ ఈ చిత్రం యొక్క సాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది, ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది, ఇకపోతే  ఈ చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు, తాజాగా విడుదలైన పాటలు విన్న తర్వాత ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది.