నాని” సరిపోదా శనివారం” షూటింగ్ స్టార్ట్

Admin

Nani Saripodhaa Sanivaraam Shooting Starts

మళ్లీ షూటింగ్లో బిజీ అవనున్న నాని

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో మరొక చిత్రం సరిపోదా శనివారం అని విభిన్నమైన టైటిల్ ని ఖరారు చేసినారు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అంటే సుందరానికి సినిమా చేశారు ఈ చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా

నాని ,ఎస్ జె సూర్య ,ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ బుధవారం నుండి హైదరాబాదులో ప్రారంభించుకుంటున్నట్లు మూవీ మేకర్స్ తెలియజేశారు.

దసరా మరియు హాయ్ నాన్న రెండు విభిన్న పాత్రలు పోషించిన నాని ఈ చిత్రంలో మరో కొత్త లుక్ తో కంప్లీట్ యాక్షన్ ప్యాకెడ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం 

బ్యానర్: డి వి ఎంటర్టైన్మెంట్

నిర్మాత: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి 

సంగీతం:Jakes Bejoy

నటీనటులు: నాని,ఎస్ జె సూర్య, ప్రియాంక అరుల్ మోహన్

దర్శకత్వం:వివేక్ ఆత్రేయ