నా సామిరంగా తనదైన శైలిలో అలరించనున్న నాగార్జున

Admin

NAGARJUNA NAA SAAMIRANGA LATEST UPDATE

ఈసారి పండక్కి నా సామి రంగా

కింగ్ నాగార్జున మరియు యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం నా సామిరంగ.

ఇక ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్ ఏమిటంటే ఈ చిత్రాన్ని 2023 డిసెంబర్ ఏడో తేదీ నాటికి పూర్తి చేయడానికి మూవీ టీం కృషి చేస్తున్నారు, 2024 సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేయాలని పట్టుదలతో హడావిడిగా షూటింగ్ తర్వాత చేయవలసిన పనులను అతి త్వరగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక భారీ అంచనాలతో వెరికెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి సొంత బ్యానర్ అయిన శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పై నిర్మిస్తున్నారు ప్రసన్న కుమార్ ఆకట్టుకునే కదా మరియు సంభాషణలతో రూపొందించారు ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు, జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు కింగ్ నాగార్జున సంక్రాంతి బరిలో నిలబడే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం

నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్రంలో నాగార్జున మరియు అల్లరి నరేష్ ఆషిక రంగనాథ్ రాజ్ తరుణ్ రవి వర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.