నాగచైతన్య నెక్స్ట్ మూవీ అప్డేట్

Admin

Updated on:

Naga Chaitnya Next Movie Update

టాలీవుడ్ నటుడు నాగ చైతన్య తమ రాబోయే ప్రాజెక్ట్‌లో దర్శకుడు చందూ మొండేటి

అక్కినేని నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటితో ఫిక్స్ చేసున్నారని తెలిసిందే.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. గుజరాతీ కథను ఆధారం చేసుకుని చందు ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఆల్రెడీ శ్రీకాకులం వెళ్లి అక్కడ లొకేషన్స్ చూసి వచ్చిన మేకర్స్ సినిమా షెడ్యూల్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారట. అంతేకాదు వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.మొత్తానికి చైతన్యతో కలిసి చందు మొండేటి పెద్ద టార్గెట్ ని పెట్టుకున్నాడని తెలుస్తుంది. సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ రోల్ లో డి గ్లామర్ గాకనిపిస్తాడని అంటున్నారు. 

కార్తికేయ , కార్తికేయ 2 ఫేమ్  డైరెక్టర్  చందు మొండేటి  సరికొత్త కథతో ముందుకు రావడంతో ఈ చిత్ర నిర్మాత కథపై ఉన్న నమ్మకంతో భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమయ్యారు, చందు మొండేటి నాగచైతన్య కాంబినేషన్లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి అవి కూడా మంచి విజయాన్ని సాధించాయి తాజాగా రాబోతున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ కాంబినేషన్ లో వర్క్ చేస్తున్నారు ఈ చిత్రానికి హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపిక చేశారని సమాచారం, ఆల్రెడీ నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ కూడా మంచి విజయం సాధించుకుంది మరి ఈ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం మరింత విజయం సాధించాలని అభిమానులు , ప్రేక్షకులుఆశిస్తున్నారు.

ఈచిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుని 2024 సెకండ్ ఆఫ్ లో రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీ గా భారీ బడ్జెట్ మూవీ గా తెరకెక్కుతోంది.