Naga Chaitanya@23 Latest Movie Update
Thandel Movie First Look
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మరియు చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం తండేల్ చిత్రాన్ని గీత ఆర్ట్స్ నిర్మిస్తుంది.
నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం ఈ చిత్రం కార్తికేయ వన్, టు సక్సెస్ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు
నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఈ సినిమాకి ఆసక్తికరమైన పేరు తండేల్ అని ఖరారు చేశారు, సరికొత్త పోస్టర్ విడుదల చేశారు అలాగే టీజర్ కూడా విడుదల చేశారు ఇందులో సాయి పల్లవి హీరోయిన్ బొట్టు పెట్టుకున్నట్లు అలాగే నాగచైతన్య సముద్రంలో ఉన్న పడవ మీద కూర్చుని ఉన్న పోస్టర్ని విడుదల చేశారు.
ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
ఈ చిత్రం కోసం నాగచైతన్య సరికొత్త లుక్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించనున్నారు
ఇటీవల విడుదలైన కస్టడీ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది కానీ ఈ చిత్రంలో నాగ చైతన్య నటన చాలా అద్భుతంగా ఉంది యాక్షన్ అండ్ ఎమోషన్ అనుకున్నది సాధించాలనే తపన చాలా అద్భుతంగా చూపించాడు.
ఈ తడేల్ సినిమాలో కూడా విభిన్నమైన నటనను కనబరుస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా నాగచైతన్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ కింద ఈ చిత్రం వస్తుంది ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.