నా సామిరంగా చిత్రంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కీరవాణి

Admin

Keeravani Talk About Naa Saami Ranga

Naa Saami Ranga Movie Teaser

ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి నా సామిరంగా చిత్రం పట్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మన తెలుగు సుపరిచిత సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి   

నా సామిరంగ చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం వహించారు.

తాజా సమాచారం ఏమిటి అంటే ఎం ఎం కీరవాణి స్వరపరిచిన పాటలు నా సామిరంగా పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకుల మదిలో అలరిస్తున్నాయి.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సంక్రాంతి కానుకగా విడుదల కానున్న చిత్రం నా సామి రంగ కింగ్ నాగార్జున ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో వన్ ఆఫ్ అత్యంత ఆసక్తి తో ఎదురుచూస్తున్న మూవీగా నిలిచింది.

ఈ సందర్భంగా ఎంఎం కీరవాణి గారు మాట్లాడుతూ ఒక సినిమాకు పాటలు ఎలా ఉన్నాయి అనేది ఆ పాటలను పెళ్లిళ్లకు వేసే భారత్ కి డాన్స్ చేస్తుంటే ఆ పాట హిట్టు అని తెలుసుకునే కాలం నుంచి ప్రస్తుతం ఒక పాట ఎంత వైరల్ అయ్యింది అనే కొలమానంలోకి వచ్చేసాము కానీ కొన్ని మంచి పాటలు కూడా వైరల్ కావు దీన్నెలా చూడాలి అని కాబట్టి నిజాయితీగా పనిచేయడం మాత్రమే మన చేతిలో ఉంది వైరల్ అయ్యేది కానిది మన చేతిలో లేదు అది ప్రేక్షకులు చేతిలో ఉండేది మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే మనం చేయవలసిన కర్తవ్యం అని చెప్పారు నా సామి రంగ చిత్రంలో తను స్వయంగా ఒక పాట రాశారని తనకు రాయటం వచ్చిన నేను రాయను అని కానీ సందర్భం వచ్చినప్పుడు రాయాలి అనిపిస్తే అప్పటికప్పుడు రాస్తాను అలా జరిగిందే నా సామి రంగలో పాట అని

 నాగార్జున తో తనకు గతంలో ఉన్న అనుబంధం గురించి గత సినిమాలు వాళ్ళిద్దరూ కాంబినేషన్లో వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అల్లరి అల్లుడు అన్నమయ్య శ్రీరామదాసు వంటి వైవిధ్యమైన చిత్రాలు కీరవాణి నాగార్జున కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు తాజాగా నా సామిరంగా చిత్రం కూడా సరికొత్త అనుభూతిని ఇచ్చింది ఈ నా సామిరంగా చిత్రం పట్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ చిత్రం ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అంతటి ఘన విజయాన్ని సాధిస్తుంది అని కూడా పలికారు.