Ramcharn Biography

Admin

Updated on:

RamCharan Biography in Telugu

పూర్తి పేరు: కొణిదెల రామ్ చరణ్ తేజ్

జననం: 27 మార్చి 1985

తల్లిదండ్రులు: కొణిదెలశివశంకర వరప్రసాద్ (చిరంజీవి), సురేఖ

భార్య: ఉపాసన

పిల్లలు: క్లీన్ కారా

బంధువులు: పవన్ కళ్యాణ్ (చిన్నాన్న) నాగేంద్రబాబు (చిన్నాన్న), అల్లు అరవింద్ (మామయ్య), అల్లు అర్జున్, అల్లు శిరీ,ష్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్,

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బయోగ్రఫీ

రామ్ చరణ్ బయోగ్రఫీ:

కొణిదెల రామ్ చరణ్ 27 మార్చి 1985 మద్రాస్ లో జన్మించాడు. రామ్ చరణ్ తెలుగు చలన చిత్రం లో అగ్ర నటులలో ఒకరు రాంచరణ్ తెలుగు సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు. టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం భారతీయ చలనచిత్రంలో అత్యధిక పారితోషకం పొందేనటులలో ఒకరు అతనికి మూడు ఫిలింఫేర్ అవార్డులు మరియు రెండు నంది అవార్డులు గెలుపొందారు 2013 లో అతను ఫోర్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నారు.అంతేకాకుండా సినీ నిర్మాత మరియు ప్రముఖ వ్యాపారవేత్త.

చరణ్ నటన జీవితం:

మెగాస్టార్ తనయుడు గా రామ్ చరణ్ తన నటన జీవితాన్ని 2007లో ప్రారంభించాడు తను తొలిగా నటించిన చిత్రం” చిరుత” దీనికి పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా పని చేశారు బాక్సాఫీస్ తో తన నటన రంగ ప్రవేశం చేశాడు ఉత్తమ పురుష డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రెండవ చిత్రం మగధీర 2009లో విడుదలై ఆల్ టైం రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఇది విడుదలైన సమయంలో భారీ విజయం సాధించి అత్యధిక వస్తువులు సాధించిన తెలుగు చిత్రం గా నిలిచింది ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది అలా మొదలైన నటన మూడో సినిమా ఆరెంజ్ భారీ అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అపజయాన్ని ఎదుర్కొంది తర్వాత వచ్చిన సినిమాలు సవాళ్లను ఎదుర్కొంటూ విజయాల్ని అపజయాలని చూస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రంగస్థలంతో పరిపూర్ణ నటుడిగా ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు R R R సినిమాతో ప్రపంచం మొత్తం నటుడిగా గుర్తింపు పొందాడు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ మూవీ లో నటిస్తున్నాడు ఈ సినిమా 2024లో విడుదల అవ్వచ్చు అని అంచనా

రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ ఆర్ సినిమాకి నాటు నాటు అనే పాటకి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

అంతేకాకుండా

2016లో చరణ్ సొంత నిర్మాణం సంస్థ ప్రారంభించారు ఈ సంస్థలో తొలి మూవీ ఖైదీ నెంబర్ 150 తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉన్నారు తర్వాత సైరా నరసింహారెడ్డి సహనిర్మాతగా వ్యవహరించారు.

 

Ramcharn Family And Childhood

ఫ్యామిలీ

రామ్ చరణ్ 27 మార్చి 1985 మద్రాస్ లో తమిళనాడులో చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించారు. తండ్రి చిరంజీవి స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, రామ్ చరణ్ తల్లి ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు అల్లు అరవింద్ తోబుట్టువు.

రామ్ చరణ్ కి అక్క సుస్మిత మరియు చెల్లెలు శ్రీజ తోబుట్టువులు ఉన్నారు.

రామ్ చరణ్ చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్ లారెన్స్ స్కూల్ లవ్డేల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, మరియు సెయింట్ మేరీస్ కాలేజ్ హైదరాబాదులో చదువుకున్నారు.

అతను ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యొక్క యాక్టింగ్ స్కూల్లో నటన శిక్షణ పొందారు.

రామ్ చరణ్ చిన్న తనంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు హాన్స్ ఇండియా నివేదించిన నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2011లో అతను తన సొంత పోలో టీం ని రామ్ చరణ్ హైదరాబాద్ పోలో రైడ్ క్లబ్ ను ప్రారంభించాడు , అంతేకాకుండా ట్రూజెట్ ఎయిర్లైన్స్ ప్రారంభించారు.

రామ్ చరణ్ మరియు ఉపాసన కామినేని 2012 జూన్ 14వ తేదీన వివాహం చేసుకున్నారు

రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా  అపోలో చారిటీ వైస్ చైర్మన్ మరియు బి పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ ఉపాస కామినేని    శోభన కామినేని కుమార్తె భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ చైన్ అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు.