Mangalvaram Telugu movie review

Admin

Updated on:

Telugu Movie mangalavaram reviews

Mongalavaram movie review

ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త తెలుగు చలనచిత్రం మంగళవారం, ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు,ఈ చిత్రంలో నటీనటులు: పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, దివ్య పెళ్లై, అజ్మల్ అమీర్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ అజయ్ తదితరులు కీలకపాత్రలో నటించారు.

విడుదల తేదీ 17 -11-2023

  

పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 లో నే యువతను మరియు సినీ ప్రేమికుల మనసు దోచుకున్న తెలుగు యువ నటి పాయల్ రాజ్ పుత్ . కానీ ఈ చిత్రం తర్వాత వరుస సినిమాలు చేసిన ఏది అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. మరోవైపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ భూపతి కూడా ఆర్ఎక్స్ 100 తోనే తెలుగు వారికి దగ్గరయ్యారు అజయ్ భూపతి కూడా మహాసముద్రంతో చేదు ఫలితాన్ని చవిచూశారు అనంతరం సరైన విజయం సాధించాలని లక్ష్యంతో మంగళవారం అనే టార్క్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. తన తొలి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తోనే ఈ సినిమా కూడా తీశారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ అండ్ ట్రైలర్లు ఆసక్తి రేకెత్తించేలా ఉండటం సినీ ప్రేక్షకులను ఈ సినిమా థియేటర్ వరకు నడిపించిందని చెప్పాలి. సినిమా టెక్నికల్ గా గాని స్టోరీ లైన్ లో గాని ప్రచారంలో గాని చాలా బలంగా కనిపించడం ఈ చిత్రంకి సినీ ప్రేక్షకులకు మరింత అంచనాలు పెంచేలా చేశాయి మరి ఈ మంగళవారం కదేంటి కథనం ఎలా ఉంది తెరపై ప్రేక్షకులను ఎలా మెప్పించింది పాయల్ రాజ్ పుత్ మరియు అజయ్ భూపతి ల క్రేజీ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనే అంశాలు చర్చిద్దాం.

కథ

మహాలక్ష్మి పురం అనే ఊరు లో ఒకరి తర్వాత ఒకరు వరుసగా రెండు జంటలు ప్రాణాలు కోల్పోతారు అది ఆ గ్రామ దేవత మా లచ్చమ్మకు ఇష్టమైన మంగళవారం రోజున అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రచారం చేసి ఊరి గోడలపై రాతలు రాస్తాడు అందువల్లే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అంతా నమ్ముతారు కానీ ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఎస్ఐ మాయా నందిత శ్వేత మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని తనదైన విశ్లేషణలో బలంగా నమ్ముతుంది అది నిరూపించేందుకు ఆ శవాలను పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే ఆ ఊరి జమీందారు ప్రకాశం బాబు చైతన్య కృష్ణ అడ్డు చెప్పుతారు అతను అడ్డు చెప్పడంతో ఊరంతా కూడా అతని మాట మీద ఉంటారు మొదటిసారి ఎస్సై మాయ తన ప్రయత్నాన్ని తగ్గించుకుని కాస్త వెనకడుగు వేస్తుంది కానీ మరొక జంట చనిపోయినప్పుడు మాత్రం ఊరివాళ్లను పోరాడి మరి పోస్టుమార్టం చేయిస్తుంది. మరోవైపు పూరి ప్రజలు గోడలపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. మరి ఆ ఊర్లో జరిగినవి నిజంగా హత్యల లేక ఆత్మహత్యల అసలు ఈ మరణాల వెనక ఉన్న లక్ష్యం ఏమిటి వీటికి ఆ ఊరి నుంచి వెలివేయబడ్డ శైలజ అలియా సైలు పాయల్ రాజ్ పుత్ ఈ చిత్ర కథానాయక కి సంబంధం ఏమిటి అసలు ఆమె కదేమిటి ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు శ్రావణ్ రెడ్డి డాక్టర్ రవీంద్ర విజయ్ జమీందారుకు అతని భార్య దివ్య పెళ్లైకు ఏమైనా సంబంధం ఉందా శైలు చిన్ననాటి ప్రియుడు రవి కదేంటి అన్నది మిగతా కథ అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ అయినాకు మధ్యలో హర్రర్ టచ్ కూడా ఇచ్చి ఆ తర్వాత కొనసాగినట్లు ఆఖరిలో ఒక చిన్న సందేశం తో ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చి కథ ముగిస్తారు .

ఆ సందేశం మహిళలకు సంబంధించినది అయితే దాన్ని చెప్పేందుకు కాదంతా అల్లుకున్న పాయింట్ కొత్తగా ఉన్న దాన్ని ప్రేక్షకులు ఏ కోణంలో రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై చిత్ర ఫలితం ఆధారపడి ఉంది ముఖ్యంగా ఇందులో అక్రమ సంబంధాల వ్యవహారం కొన్ని ద్వందర్థ సంభాషణలు కథానాయకకు ఉన్న సమస్య వంటివి ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి సంకోచిస్తారు.

ఇక ఈ చిత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే అసలు హీరోయిన్ ఇంటర్వెల్ ముందు వరకు కనిపించకపోయినా కథ మెయిన్ పాయింట్ మొదలు కాకపోయినా సినిమాను ఎక్కడ బోర్ కొట్టించకుండా ఇంట్రెస్టింగ్ గా కథను ముందుకు సాగించారు దర్శకుడు అజయ్ భూపతి.

శైలు చిన్నతనం ఎపిసోడ్ తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది రవితో ఉన్న ఆమె చిన్ననాటి ప్రేమ కథ ఇంట్లో తండ్రితో పడే ఇబ్బందులు రవి కుటుంబ నేపథ్యం మొదలైన వాటితో సినిమా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత కదా వర్తమానంలోకి వస్తుంది మహాలక్ష్మి పురం ఊరిలో అందులోని పాత్రల వ్యక్తిత్వాలను పరిచయం చేస్తూ నెమ్మదిగా సినిమా ముందుకు సాగుతుంది అక్రమ సంబంధం పెట్టుకున్న జంటల పేర్లు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఊరికి గోడలపై రాస్తుండటం మరసటి రోజే ఆ జంటలు చనిపోవడం గ్రామ దేవతకు ఇష్టమైన మంగళవారం రోజునే ఈ మరణాలు సంభవించడం ఊరి వాళ్లంతా ఆందోళన చెందడం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకోవడానికి పూరి ప్రజలందరూ ఏకమై రంగంలోకి దిగడం ఇలా క్రమంగా సినిమాను ఇంట్రెస్టింగ్ పెంచుతూ కథ వేగం మరింత పుంజుకుంటుంది ఈ నేపథ్యంలో వచ్చే విరామ సన్నివేశాలు త్రిలింగ ఉంటాయి ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది.

ఇంటర్వెల్ తర్వాత మళ్లీ శైలు గతంలోనే ఎలా ఉంది అనే అంశం తోనే మొదలవుతుంది అయితే ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే ఇక్కడ నుంచి కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది కాలేజీలో శైలుకు ఇంగ్లీష్ లెక్చరర్ మదన్‌కు మధ్య నడిచే ప్రేమకథ సోషగా అనిపిస్తుంది వీరి మధ్య వచ్చే రొమాంటిక్ గీతం యువతరానికి నచ్చేలా ఉంటుంది శైలుకు జరిగిన అన్యాయం ఆమెకున్న మానసిక రుగ్మత దానివల్ల తను పడే యాతన భావోద్వేగ భరితంగా ఉంటుంది అయితే ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఏ కోణంలో చూస్తారన్నది చర్చనీయాంశం కాకపోతే సినిమా ముగించిన తీరు ప్రేక్షకుల్లో కాస్త అసంతృప్తి భావన కలిగిస్తుంది.

ఇంకా నటీనటుల విషయానికి వస్తే శైలు క్యారెక్టర్ లో పాయల్ రాజ్ పుత్ చక్కగా ఒదిగిపోయింది, తన గ్లామర్ తో పాటు నటనకు కూడా ప్రాధాన్యత నిచ్చే పాత్ర తనది అయితే తను ఇంటర్వెల్ తర్వాత నుండి కనిపిస్తుంది భావోద్వేగా భరితమైన సన్నివేశాల్లో చక్కగా నటించింది ఎస్సై పాత్రలో నందిత శ్వేత చాలా బాగా నటించింది సీరియస్ లుక్ లో తనదైన శైలిలో కనిపించింది.

 ఇంకా అజయ్ గోస్ మరియు లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీ సీన్లు గాని జమిందార్ గా కృష్ణ చైతన్య పాత్రను కానీ కథకు తగ్గట్టు మంచిగా డిజైన్ చేశారు శ్రీ తేజ శ్రావణ్ రెడ్డి రవీంద్ర విజయ్ తదితర పాత్రలకు న్యాయం చేశారు అదే రాసుకున్న కథ కుటుంబ ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. 

ఇందులో మరొక ట్రస్ట్ ఏంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ ముందు అసలు కథ ఎంటర్ అవ్వదు ఇంటర్వెల్ తర్వాత సరైన ముగింపు ఉండదు. ఇది ప్రధాన లోపం ఏ సినిమాకు హీరోయిన్ చిన్ననాటి ప్రియుడు అలాగే అజ్ఞాత వ్యక్తి విషయంలో ఒక మీడియం రేంజ్ స్టార్ ను రంగంలోకి దించుంటే బాగుండేది అనిపించింది టెక్నికల్‌గా సినిమా ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది నేపథ్య సంగీతం సినిమాకు ఒక తలుపు తీసుకొచ్చింది జాతర పాటను స్వరపరిచిన తీరు దాన్ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకున్నాయి .

 ముఖ్య గమనిక ఇది మా దృష్టి కోణం మాత్రమే ప్రేక్షకుల భావాల ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే