Kannappa Telugu movie poster release

Admin

Kannappa first look

kannaappa poster

Manchu vishnu Kannppa poster

మంచు విష్ణు నటిస్తున్న సరికొత్త తాజా చిత్రం కన్నప్ప.

KANNAPPA చిత్రం మంచు విష్ణుకి డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇటీవలే తను తెలియజేశారు ,ఈ సినిమా కోసం ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు, కధకు తగినట్లు దేశంలోని స్టార్ నటి నటులను మంచు విష్ణు ఎంపిక చేశారు.

ఈ పోస్టర్లో ముందుగా మనకు కనిపించేది స్పష్టంగా శివలింగం ఆకారం తో మూడు నామాలు ఉన్నట్లు దర్శనమిస్తుంది, అలాగే మంచు విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే అతని వైపుకు మెరుపు వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకు వస్తున్నాయి అన్నట్లు ఈ పోస్టర్ ఉంది రెండు కొండల మధ్య జలపాతం చాలా బాగుంది కన్నప్ప టైటిల్ ఆర్ట్ కూడా మంచి మార్కులే ఇవ్వచ్చు, ఏదేమైనా మోస్ట్ ప్రెస్టేజ్ మూవీ ఈకన్నప్ప అత్యంత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఈ కన్నప్ప మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణు కి ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు.

ఈ కన్నప్ప సినిమా కోసం వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సీనియర్ నటులు భాగం అవుతున్నట్లు సమాచారం మలయాళం నుంచి మోహన్లాల్ కన్నడ నుంచి శివరాజ్ కుమార్ కోలీవుడ్ నుంచి నయనతార పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోహన్ బాబు శరత్ కుమార్ ఇందులో నటిస్తున్నారు శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ కన్నప్ప సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు ఈయన స్టార్ ప్లస్ లో మహాభారతం సిరీస్ కూడా తెరకెక్కించారు.

మరి ఈ సాలిడ్ కంటెంట్ తో వస్తున్న మంచి విష్ణుకి మంచి విజయం అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.