Mahesh Babu and rajamouli movie big update

Admin

Rajamouli and Mahesh Babu latest movie Big Update

rajamouli and mahesh babu

రెండు భాగాలుగా రాజమౌళి తదుపరి చిత్రం

పాన్ ఇండియా డైరెక్టర్ దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి వరుస బ్లాక్ బాస్టర్ తో అపజయం ఎరుగని డైరెక్టర్ గా తన సత్తా చాటుకున్నారు.

 అతని చివరి సినిమా ఆర్ఆర్ఆర్  కూడా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే, అయితే తాజా సమాచారం ప్రకారం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తెరకెక్కించడానికి భారీ ప్రణాళికను రచించారు, రాజమౌళి తదుపరి చిత్రం పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కి తన సినిమాలను తీసుకువెళ్లాలని గట్టి సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తుంది.

 ఇందులో భాగంగా ఒక హాలీవుడ్ స్టార్ కి ఏ మాత్రం తగ్గని చరిస్మా నటన ప్రతిభ ఉన్న మహేష్ బాబుతో అయితేనే ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం.


అయితే ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సహా రచయితల తో కలిసి టీం గా స్క్రీన్ ప్లే దాదాపు పూర్తి చేశారు త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది అని సమాచారం ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రారంభించి నటీనటుల ఎంపికలను కూడా పూర్తి చేస్తారని తెలిసింది అయితే అంతకంటే ముందే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ కూడా వచ్చేసింది.


ఈ సినిమాను కూడా మన రాజమౌళి అండ్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు సమాచారం, అయితే గతంలో తీసిన బాహుబలి సినిమా ఒక పార్ట్-టుగా తెరకెక్కించాలని ప్లాన్ చేసిన కథ కథనం ప్రకారం అది రెండు భాగాలుగా రూపుదిద్దుకుంది.

 ఆ రెండు భాగాలు ఘనవిజయం సాధించాయి బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే రేంజ్ లో తెలుగు ఇండస్ట్రీ సినిమాని పాన్ ఇండియా సినిమాగా మార్చిన ఘనత రాజమౌళిదే ఇప్పుడు మహేష్ తో సినిమా కూడా రెండు భాగాలుగా నిర్మించనున్నారు.
ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అని చాలాకాలంగా కథనాలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అధికారికంగా రావాల్సి ఉంది మరోపక్క పాపులర్ ఆంగ్ల నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారని కూడా సినీవర్గాల పుకార్లు మరి మహేష్ బాబు రాజమౌళి క్రేజీ కాంబినేషన్ గురించి ప్రేక్షకులు అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు,ఆర్ఆర్ .ఆర్ మరియు బాహుబలి తరహాలోనే ఈ సినిమాకి అడ్వాన్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం ఈ సినిమాని పాన్ ఇండియాలో మాత్రమే కాదు పాన్ వరల్డ్ మార్కెట్లో విడుదల చేయాలని పూర్తి ప్లాన్ దీనికోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియో తో కలసి పనిచేస్తున్నారని సమాచారం.

ప్రముఖ తెలుగు నిర్మాత కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు హాలీవుడ్ నుంచి ప్రముఖ సాంకేతిక నిపుణులు స్పెషలిస్టులు స్టంట్ మాస్టర్లు బరిలో దించుతున్నారని కూడా సమాచారం, త్వరగా ఈ సినిమా పట్టాలెక్కి మరింత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకి రావాలి సినిమా మంచి విజయం సాధించాలి అని కోరుకుందాం.