Gunturu Kaaram Movie SONG RELEASE

Admin

Updated on:

Gunturu Kaaram Song Release

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తెలుగు చలనచిత్రం గుంటూరు కారం.

ఏ సినిమా కి సంగీతం ఎస్ఎస్ తమన్ అందించారు.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో రిలీజ్ కి సిద్ధమైన సంగతి అన్న అందరికీ తెలిసినదే.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన దమ్ మసాలా
అనే సాంగ్ విడుదల చేశారు, ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది,

అయితే ఇంకో విషయం ఏమిటంటే ఈ సాంగ్ కి త్రివిక్రమ్ రైటింగ్ పదాలు కూడా జతకూర్చినట్లు సమాచారం, ఎస్ ఎస్ తమన్ సమకూర్చిన ఈ పాటకు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట సాయం కూడా అందించాడని సమాచారం గుంటూరు కారం సాంగ్ లో ఆ పదాలన్నీ త్రివిక్రమ్ వే.

ఎలాగైతే నేమి మహేష్ బాబు అభిమానులకు ఎదురుచూపులు ఫలించాయి గుంటూరు కారం నుంచి మొట్టమొదటి సాంగ్ రిలీజ్ అయ్యి యూట్యూబ్లో ట్రెండ్ అవుతూనే ఉంది మసాలా పేరిట రిలీజ్ అయిన ఈ సాంగ్కు మాస్ మసాలా ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే పాటగా నిలిచింది, తమన్ మరోసారి పెప్పి సాంగ్
కంపోజ్ చేశాడు, ఈ సాంగ్ లో ఉన్న ర్యాప్ వెర్షన్కు త్రివిక్రమ్ సాహిత్యం సమకూర్చాడు దీనికి ముద్దుగా స్పైస్ ర్యాప్ అనే పేరు కూడా పెట్టుకున్నారు.

ఈ పాటను సుజిత్ మరియు హెగ్డే తో కలిసి తమన్ ఆలపించగా పట్టికలర్గా త్రివిక్రమ్ రాసిన పదాలను అదే ఆ స్పైస్ ర్యాప్ వెర్షన్ను హేమచంద్ర, విక్కీ సంయుక్తంగా ఆలపించారు.

త్రివిక్రంతో సంగీత చర్చలు కూర్చుంటే అటు రచయితతో పాటు ఇటు సంగీత దర్శకుడికి చాలా పని తగ్గుతుంది ఈ విషయాన్ని అలా వైకుంఠపురం సినిమా సందర్భంలో స్వయంగా S S Thaman వెల్లడించారు ఈరోజు రిలీజ్ అయిన గుంటూరు కారం సాంగ్ లో కూడా ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది రామజోగయ్య రచన కంటే త్రివిక్రమ్  పదాలే ఎక్కువ సాహిత్యంలో కనిపిస్తుంది.

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఎస్ ఎస్ ఎం బి అభిమానులకు గుంటూరు కారం అప్డేట్స్ రిలీజ్ డేట్ పై కూడా సందిగ్ధత వీడింది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గుంటూరు కారం విడుదల అవుతుంది.

నటీనటుల విషయానికి వస్తే మహేష్ బాబు సరసన పూజ హెగ్డే మరియు శ్రీ లీల నటిస్తుండగా,

జాన్ అబ్రహం, మరియు జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు