Kota bommali upcoming release Telugu movie

Admin

Updated on:

పోలీసులు పడే కష్టాలను తెలుసుకోవాలంటే కోటబొమ్మాలిచూడాల్సిందే

KOTA BOMMALI PS

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కోటబొమ్మాలి లింగిడి పాట

 చిత్రం :కోటబొమ్మాలి

నటీనటులు: శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, రామారావు జాదవ్ తదితరులు కీలకపాత్రలో నటించారు

      పోలీసులు మరియు రాజకీయ నాయకుల మధ్య జరిగే సన్నివేశాలు పోలీసుల అధికారాన్ని రాజకీయ నాయకులు ఎలా వినియోగిస్తున్నారు అనేది ప్రజలకు తెలియజేయడం కోసం కోటబొమ్మాలి పిఎస్ అనే తెలుగు సినిమా తీశామని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు ఇది కేవలం ప్రజలకు తెలియజేయడం కోసమే ఎవరిని ఉద్దేశించి కాదు ఏ రాజకీయ నాయకుడిని కానీ ఏ పోలీస్ అధికారిని కానీ ఉద్దేశించి సినిమా తీయలేదు అని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల జరిగిన వేడుకలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీకాంత్ రాహుల్ విజయ్ శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తేజ మార్ని తెరకెక్కించిన తెలుగు చలనచిత్రం కోటబొమ్మాలి పిఎస్.

గీత ఆర్ట్స్ టు పతాకంపై బన్నీ వాస్,విద్యా గొప్పినీడి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది.

ఈ చిత్రం ఈ నవంబర్ 24 2023 తేదీన థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం వేడుకలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో ఎవరు లేరు ఈ చిత్రానికి కదే హీరోగా ఉంటుంది పోలీసుల్ని పోలీసులే పట్టుకోవాలనుకునే ఒక విచిత్రమైన కథగా ఉంటుంది అన్నారు అలాగే ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి  ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అని తెలుస్తోంది.

ఈ చిత్రంలో లింగిడి అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వ్యూస్ తో ట్రెండ్ అవుతున్న పాట, ఈ పాట ఇంస్టాగ్రామ్ వీల్స్ లో ఫేస్బుక్ రీల్స్ లో చాలామంది థియేటర్స్ డాన్స్ వేయటం ఎంజాయ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం పాట ద్వారా ఈ చిత్రం ప్రజలకు మరింత దగ్గర అయ్యింది. 

అంతేకాకుండా ఈ చిత్రం ముందస్తు ఈవెంట్లో ఈ చిత్ర దర్శకుడు అయిన తేజ మార్ని కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు  చేశారు ఓటర్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలి అని ఇదొక మంచి ఎమోషనల్ థ్రిల్లర్  ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు.

 ,