Jr Ntr Biography

Admin

Updated on:

నందమూరి తారక రామారావు బయోగ్రఫీ

jr ntr wiki

పూర్తి పేరు : నందమూరి తారక రామారావు

జన్మదినం :మే 20 1983

పుట్టిన స్థలం: హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత తెలంగాణ

వృత్తి :సినీ నటుడు

భార్య :లక్ష్మీ ప్రణతి

పిల్లలు: అభయ్ రామ్ భార్గవ్ రామ్

బంధువులు: ఎన్.టి.రామారావు, నందమూరి బాలకృష్ణ ,కళ్యాణ్ రామ్, జానకి రామ్, తారకరత్న ,నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రామకృష్ణ, నారా రోహిత్.

 

బాల్యం విద్యాభ్యాసం

తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు జూనియర్ మరియు (Tarak)అని పిలవబడే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ ,తల్లి శాలిని భాస్కరరావు అన్న కళ్యాణ్ రామ్ సినీ నటుడు

నందమూరి తారక్ 1983 మే 20వ తేదీన హైదరాబాదులో జన్మించాడు. తను ఏడేళ్ల వయసులోనే బాల నటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో సినీ కెరియర్ ప్రారంభించాడు.
 
నందమూరి తారక రామారావు జూనియర్ హైదరాబాదులోని విద్యారణ్య హై స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు, ఆ తర్వాత హైదరాబాదులోని సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, ఆ తర్వాత కొంతకాలం ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో కూడా చదువుకున్నాడు, అంతేకాకుండా తనకు కూచిపూడి లో మంచి ప్రావిన్యం కలవాడు.
 
 
సినీ జీవితం
 
నందమూరి తారక రామారావు జూనియర్ తన బాల్యంలోనే బాల నటుడిగా నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో తొలి చిత్రం నటించాడు.
 
తర్వాత 1997 గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుకున్న రామాయణం చిత్రంలో రాముడి పాత్రను పోషించాడు ఇది ఉత్తమ పిల్లల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత 2000 సంవత్సరంలో స్టూడెంట్ నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో తొలి చిత్రం గా రూపొందింది ఈ సినిమా మంచి విజయం సాధించింది ఆ తర్వాత ఆది కూడా అద్భుతమైన విజయం అందుకుంది అందరి లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరియర్లో హెచ్చుతగ్గులు రాక తప్పలేదు అల్లరి రాముడు నాగ సాంబ నా అల్లుడు అశోక్ నరసింహుడు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని చవిచూశాయి.
తనకు మంచి గుర్తింపు పొందిన చిత్రం సింహాద్రి లో తన సంపూర్ణ నటనను ప్రదర్శించాడు ఇది కూడా రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం బ్లాక్ బ్లాస్టర్ హిట్గా నిలిచి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది అప్పటివరకు.
గత సంవత్సరం విడుదలైన RRR చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది ప్రస్తుతం ఆయన దేవర టైటిల్ గల చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.