Japan Telugu Movie REVIEW

Admin

Updated on:

Japan Telugu mOVIE rEVIEW

kARTHI Latest Movie Japan Movie Review

నటీనటులు: కార్తీ అను ఇమ్మానుయేల్, సునీల్ ,విజయ్ మిల్టన్ ,j రమేష్ తదితరులు, ప్రధాన పాత్రల్లో నటించారు.

సినిమాటోగ్రఫీ: ఎస్ రవి వర్మన్

సంగీతం :జి .వి .ప్రకాష్ కుమార్

దర్శకత్వం; రాజు మురుగన్

నిర్మాత ;ఎస్. ఆర్. ప్రకాష్ బాబు ,ఎస్. ఆర్. ప్రభు

విడుదల;10-11-2023  date

తమిళ స్టార్ హీరో కార్తీ మరియు రాజు మురుగన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం జపాన్ కార్తీ కెరీ సినీ కెరియర్ కు ఇది 25వ చిత్రం తెలుగులో బలమైన మార్కెట్ ని సొంతం చేసుకున్న కార్తీ సినిమా అంటే తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది ఆ ఆసక్తి మరింత పెంచుతూ సందడి చేశాయి గతంలో విడుదలైన చిత్రాలు అదే ఉత్సాహంతో విడుదలైన జపాన్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.

తమిళనాడులోని ఒక నిజమైన దొంగ కథగా ప్రచారమైన ఈ సినిమా కార్తీ 25 మూవీ తగ్గట్టు ఉందా  తెలుగు అభిమానులకు ప్రేక్షకులకు ఈ చిత్రం మెప్పించిందా అంటే …? తెలుసుకోవాలంటే ముందుగా కథలోకి వెళ్దాం!

జపాన్ ముని కార్తి ఓ పేరు మోసిన దొంగ దోపిడీకి పన్నాగం పన్నాడంటే గురి తప్పదు అంతే పోలీసుల్ని సైతం మట్టికరిపించే సత్తా ఉన్నవాడు అనుకున్నది అనుకున్నట్లుగా కాజేస్తాడు ఒక దోపిడీలో పాల్గొన్నప్పుడు పోలీసు అధికారులకు చెందిన కొన్ని  సీక్రెట్ వీడియోలు చేతికి దొరుకుతాయి , వాటిని తన దగ్గరే ఉంచుకున్న జపాన్ పోలీసులకు టార్గెట్ గా మారతాడు. ఒకపక్క పోలీసులు ఎలాగైనా ఆ వీడియోలు ని సొంతం చేసుకుని జపాన్ని అంతమొందించాలని పోలీస్ అధికారులు శ్రీధర్ గా తెలుగు నటుడు సునీల్ భవాని గా విజయ్ మిల్టన్ రంగంలోకి వెళ్తారు , మరోవైపు కర్ణాటక పోలీసులు కూడా జపాన్ వెంబడిస్తుంటారు, ఇదిలా ఉంటే జపాన్ బాధితుడు ఒక నగలు దుకాణంలో 200 కోట్ల విలువ చేసే నగలు దోపిడికి గురి అవుతాయి ఆ దొంగతనం జపాన్ చేశాడని పోలీసులకు ఆధారం దొరుకుతాయి అయినా సరే ఓ అమాయకుడు ఆ కేసులో ఇరుక్కుంటాడు ఇంతకీ ఆ దొంగతనం ఎవరు చేశారు దొరికాడా ఆ అమాయకుడు కేసు నుంచి బయటపడ్డాడు అసలు జపాన్ ఎలా దొంగగా మారాడు సినీనటి సంజు అను ఇమ్మానుయేల్  జపాన్ కి ఎలా పరిచయమవుతుంది వీరిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటి తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.

డబ్బు దోపిడీ నేపథ్యంలో సాగే సినిమాలకు ఎప్పుడూ ఒక ఉత్సాహం కామెడీ కోరుకుని వెళ్లే ప్రేక్షకులు ఆ క్రేజ్ వేరు వీటికి అన్ని భాషల్లోనూ ప్రత్యేకమైన అభిమానులు ఉంటున్నారు, ఏం జరుగుతున్నా ఉత్కంఠ మరియు ఆసక్తి రేకెత్తించేలా ఇటువంటి సినిమాలు ప్రేక్షకులకు ‌ మరింతఉత్సాహాన్ని అందిస్తాయి, హీరో ఎలివేషన్ ని మరో స్థాయిలో ఆవిష్కరిస్తుంటాయి అలా చేసిన కార్తి మనీ హెయిర్ స్టైల్ సినిమా జపాన్ ఇందులో కార్తీక్ హాస్యం మరియు విభిన్నమైన హెయిర్ స్టైల్ విభిన్నమైన నేపథ్యం పాత్రకు తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు తల్లి సెంటిమెంట్ అంశాలు జోడించారు అంతవరకు బాగానే ఉంది కానీ కథను నడపడంలో సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేకపోయారు ఫలితం సీరియల్ సెంటిమెంట్ గ్రీన్ అంటూ ఇందులో చాలా చోట్ల కథానాయకుడు వ్యంగంగా సంభాషణలు చెబుతూ ఉంటాడు ఆ మాటలకు తగ్గట్టే ఇందులో కొన్ని కొన్ని సన్నివేశాలు మరి బలవంతపు డ్రామా తోనూ కొన్ని స్పష్టత లేనట్టు సాగుతూ ఉంటాయి. క్రేజీగా అనిపించే జపాన్ పాత్ర నడవడిక అక్కడక్కడ నవ్వించిన చాలా సన్నివేశాలు అసహనంగా సాగుతాయి .

నగల దుకాణంలో దోపిడీ నుంచే అసలు కథ మొదలవుతుంది దోపిడీ జరిగిన చోట ఆధారాల సేకరించడం ఆ క్రమంలో నగలు తయారు చేసే దుకాణాల దగ్గర డ్రైనేజీలో కలిసే వ్యర్ధాల నుంచి బంగారం సేకరించి ఆసక్తికరంగా అనిపిస్తుంది జపాన్ పాత్ర రాకతో కథకు మరింత ఊపు వస్తుంది గోల్డెన్ స్టార్ గా జపాన్ సినిమాతో చేసే హంగామా నవ్విస్తుంది జపాన్ విలాసవంతమైన జీవితం హీరోయిన్ తో ప్రేమ నేపథ్యంతో సన్నివేశాలు సాగుతాయి మరోవైపు సమాంతరంగా కేసులు ఇరుక్కుపోయిన ఓ అమాయకుడి జీవితాన్ని చూపిస్తూ కథ నీ ముందుకు నడిపించారు ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు కొంచెం ఉత్సాహాన్ని ఇస్తాయి సింహం ముసుగులో నక్క ఉందన్న అంశమే ప్రధానంగా సెకండాఫ్లో మొదలవుతుంది అయితే ఆ నక్క ఎవరనే విషయం బహిర్గతమయ్యే తీరు సరిగా ఉండదు పతాక సన్నివేశాలు సినిమాకి ప్రధాన బలం మనసులకు హత్తుకునేలా ఆ సన్నివేశాలు తీర్చిదిద్దారు ఈ కథలో హెచ్ఐవి ప్రస్తావన ఎందుకో అర్థం కాలేదు అనే పద్యం కథ పైన డ్రామా పైన పెద్దగా ప్రభావం చూపించదు అది లేకపోయినట్లయితే కథానాయకుడు పాత్ర మరింత ప్రభావం చూపించేదేమో మొత్తంగా అక్కడక్కడ పర్లేదు అనిపించే సన్నివేశాలు ఉన్నప్పటికీ కథానాయకుడు పాత్ర చేసే హంగామా మినహా సినిమా ప్రేక్షకుల్ని అనుకున్న రీతిలో మెప్పించదు

ఇంకా ముగింపు మాట ఏమిటి అంటే జపాన్ మేడిన్ ఇండియా అంటూ కథానాయకుడు కార్తీ పాత్రలో ఒదిగిపోయాడు తన నటన తీరు మరోసారి ప్రేక్షకులకు ఆకర్షణ కలిగిస్తుంది అలాగే అతని డైలాగ్ డిటెక్షన్ తో చాలాచోట్ల కామెడీ పండుతుంది జపాన్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది కార్తి ఇందులో గత చిత్రాల కంటే కొత్తగా కనిపిస్తారు అను ఇమ్మానుయేల్ పాత్రలో బలం లేదు సినిమా లో  ఆమె గాలిలో తేలియాడినట్టు ఉంటుంది, సునీల్ కీలకమైన పాత్రలో కనిపిస్తాడు అతని గెటప్ అంత సహజంగా ఉండదు విజయ్ మెల్టన్ కేఎస్ రవికుమార్ తదితరుల పాత్రలు పరిధి మేరకు బానే నటించారు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది రవి వర్మన్ విజువల్స్ సినిమాకి కొత్త కలర్ ని తీసుకొచ్చింది జీవి ప్రకాష్ కుమార్ సంగీతం కూడా బాగుంది రాజు మురుగన్ రచనలో బలం ఉన్న కార్తి ఇమేజ్ ప్రభావం ఆయనపై ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సన్నివేశాల్లో వేగం లేదు నిర్మాణం ఉన్నతంగా ఉంది.

ముఖ్య గమనిక ఏమిటి అంటే ఇది మా అభిప్రాయం మాత్రమే

సినిమా చూసే వాళ్ళ దృష్టి కోణాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో అర్థం అవుతుంది.