Hi Nanna Movie Review

Admin

Updated on:

Hi Nanna Movie Telugu Review

హృదయానికి హత్తుకునే గాజు బొమ్మ హాయ్ నాన్న

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చేకూరి మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్త నిర్వహణలో తెరపైకి రాబోతున్న తెలుగు సినిమా హాయ్ నాన్న ఈ సినిమాకి శౌర్యువ్ దర్శకత్వం వహించారు.

నాని మ్రోణాల ఠాకూర్ బేబీ కియారా కన్నా ప్రధాన పాత్రల్లో ఈ రోజు డిసెంబర్ 7 – తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో విడుదల అవుతున్న పాన్ ఇండియన్ మూవీ హాయ్ నాన్న

దసరా సూపర్ హిట్ తరవాత నాని హీరోగా వస్తున్న తెలుగు మూవీ హాయ్ నాన్న .ఈ సినిమా ఒక ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కంట నీరు రాకుండా ఎవరు ఉండలేరు.
 
 నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న థియేటర్లో కి వచ్చేసింది నాని అష్ట చమ్మ తో తెలుగు సినిమా కి అడుగు పెట్టిన నాని విభిన్నమైన పాత్రలతో అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని పొందాడు ఇటీవల విడుదలైన దసరా లో మా స్ అవతారాన్ని ప్రదర్శించిన నాని ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమాలో అందుకు పూర్తి భిన్నమైన ఒక తండ్రి కూతురు కథని ఎంచుకుని సి ఈ సినిమా లో నటించారు, ఈ సినిమా తో శౌర్యువ్ అని యువ దర్శకుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు , మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన  HI NANNA చిత్రం ఎలా ఉంది ,తండ్రి కూతుర్ల పాత్రలు హృదయాలకు హత్తుకునేలా ఉన్నాయా  తెలుసుకుందాం.

 

కథ
 
విరాజ్ (నాని) ముంబై నగరంలో ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తాడు. తనకి మహి అనే కూతురు ఉంటుంది, తన పుట్టినప్పటినుంచి ఏదో వ్యాధితో బాధపడుతున్న తన కూతురు మహి (కియారా) నే తన సర్వం అని భావించి బ్రతుకుతుంటాడు. కూతురికి సరదాగా కథలు చెప్పడం విరాజ్  అలవాటు, ఆ కథల్లో హీరోగా నాన్నని ఊహించుకుంటూ ఉంటుంద ఆ కూతురు ఒకరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. 
నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తేనే చెబుతాను అంటాడు విరాజ్.
 ఆ కోపంతో అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది రోడ్డుపై ప్రమాదం నుంచి ఆ చిన్నారిని కాపాడుతుంది యస్న (మృణాల్ ఠాకూర్), ఆ తర్వాత వాళ్ళిద్దరూ స్నేహితులుగా మారుతారు.
 తన కూతురిని వెతుకుతూ వచ్చిన విరాజ్ కి యస్నాతో కలిసి ఒక కాఫీ షాప్ లో కనిపిస్తుంది అక్కడే విరాజ్ మహికి తన అమ్మ కథ చెబుతాడు ఈసారి కథలో అమ్మ వర్ష పాత్రని యశ్న లో ఊహించుకుంటుంది మహి మరి ఈ వర్ష ఎవరు? వర్ష తన కూతురు మహీని వదిలి దూరంగా ఎందుకు ఉంది దానికి గల కారణం? యస్న మహి తల్లికి సంబంధం ఏమిటి? అప్పటికే పెళ్లి నిశ్చయమైన యస్న… విరాజ్  ని ఎలా ప్రేమించింది ఆ ప్రేమ గెలుస్తుందా వాళ్ళు కలిసి ఉంటారా? చిన్నారి తన తల్లి చెంతకి చేరిందా లేదా తదితర విషయాలు థియేటర్లలో చూడాల్సిందే.
 
 ఈ సినిమా ఎలా ఉంది అని అంటే రొటీన్ ప్రేమకథ లాగే ఉన్నప్పటికీ ఈ కథ నేపథ్యంలో సాగే మలుపులు కొత్తగా అనిపిస్తాయి, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు చాలా బలంగా నిలిచాయి. ముఖ్యంగా మహి తన అమ్మగా హీరోయిన్ యస్న నీ ఊహించుకోవడం మొదలైనప్పటినుంచే ఈ కథ మలుపు మొదలవుతుంది అది ఎటు ప్రయాణిస్తుందో ప్రేక్షకుడు ఒక వంచనాకి వస్తాడు తదుపరి సాగే సన్నివేశాలలో ఈ కథకు కావలసిన సంఘర్షణని హృదయానికి హత్తుకునేలా చేస్తాయి, ట్విస్టులు ఎమోషన్స్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్తాయి అయితే ఈ సినిమాలో ఆవిష్కరించిన ప్రేమలోనే బలహీనత ఉన్నట్లు అనిపిస్తుంది.

 నిజానికి రెండు ప్రేమ కథలు ఇందులో ఉంటాయి విరాజ్,వర్షా కదా ఒకటి విరాజ్, యస్న కథ మరొకటి. ఈ రెండు ప్రేమ ఒక ప్రేమ జంటకు ఉండాల్సిన కెమిస్ట్రీ అనుకున్నంత స్థాయిలో ఉండకపోవడం ఫస్ట్ ఆఫ్ కొంచెం నిదానంగా సాగుతుంది, ప్రేమలో పడటం మళ్ళీ దూరం అవటం వంటివి సాధారణంగానే అనిపిస్తాయి. వర్ష కథ విని యస్న విరాజ్ తో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత మహి ఎవరి కూతురు అనే మలుపు సినిమాని ఆసక్తికరంగా మారుస్తుంది సెకండాఫ్లో వచ్చే ఎమోషన్స్ తో మళ్లీ దర్శకుడు గత పై పట్టు సాధించాడు. తండ్రి కూతుర్ల పాత్రలు ఇద్దరి నేపథ్యంలో పండే భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలం .. కొన్ని డైలాగ్ లు అయితే చాలా ఎమోషనల్ తో కూడుకున్న డైలాగులు ఉంటాయి అవి సినిమాలో చూసి ఆనందించాల్సిందే నాని తనదైన శైలిలో నటనను ఖండించాడు సినిమాకు ప్రధాన బలం నానియే.. చివరిలో జయరాం పాత్రతో మరో ప్రధాన మలుపు కీలకం హీరో హీరోయిన్లు ఎలా ఒకటవుతారు అనేది థియేటర్లో చూడాల్సిందే చివరికి కథానాయక తన ప్రేమను ఎలా నిలబెట్టుకుంది అనేది కూడా ఈ సినిమాకు హైలైట్
మొత్తంగా చూస్తే ఈ తరహా సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ రాలేదు ఎమోషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వినోదం పంచడంలో మాత్రం ఈ సినిమా విజయవంతం అవుతుంది..
 
నాని తన అద్భుతమైన నటనతో హృదయాన్ని బరువెక్కించాడు చిన్నారితో కలిసి పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రత్యేకం నాని ,మృణాల్ ఠాకూర్ జోడి బాగుంటుంది కాకపోతే వారిద్దరి మధ్య ప్రేమ కథకు తగ్గ కెమిస్ట్రీ ఇవ్వలేదు అనిపిస్తుంది ఒకవేళ తండ్రి కూతుర్ల ని ప్రధానంగా చూపించడం కోసం తగ్గించారేమో తెలీదు. రోనాల్డ్ ఠాకూర్ తన అభినయంతో కట్టిపడేసింది. బేబీ కియారా ముద్దు ముద్దుగా కనిపిస్తూ కంటతడి పెట్టించింది. ప్రియదర్శి అంగన్బేది జయరాం విరాజ్ అశ్విన్ తదితరులు కీలకమైన పాత్రలో కనిపిస్తారు, సినిమా ఉన్నతంగా కనిపిస్తుంది సాంకేతికంగా బాగుంటుంది కదిరికి తగ్గ సన్నివేశాలు సంగీతంతో సినిమా సాగుతుంది పాటలు కూడా బాగున్నాయి విజువల్స్ వేషం సంగీతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి మొత్తంగా ఈ సినిమా బాగుంది.
 
గమనిక
ఇది కేవలం మేము చూసిన దృష్టి కోణం మాకు అనిపించింది మాత్రమే కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.