Guntur kaaram movie Telugu review

Admin

గుంటూరు కారం తెలుగు రివ్యూ

చిత్రం :గుంటూరు కారం

నటీ నటులు: మహేష్ బాబు శ్రీ లీల మీనాక్షి చౌదరి రమ్యకృష్ణ జగపతిబాబు ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు

సంగీతం: s s థమన్

దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత: రాధాకృష్ణ

బ్యానర్: హారిక హాసిని ఫిలిమ్స్

 

 

గుంటూరు కారం తెలుగు రివ్యూ

 

అభిమానులను నిరాశపరిచిన గుంటూరు కారం

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం భారీ అంచనాలతో ఈరోజు థియేటర్లలో విడుదల అయ్యింది.

గత ఏడాది మహేష్ బాబుకు ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు ఈ సంక్రాంతి వచ్చే గుంటూరు కారం పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ అటు సోషల్ మీడియాలోనూ ఇటు బయట ఇదే టాపిక్ తో ఇన్నాళ్లు చర్చలు జరిగాయి

2024 సంక్రాంతి బరిలో విడుదల అయిన రెండవ సినిమా గుంటూరు కారం ప్రేక్షకుల ను ఎంతవరకు మెప్పించిందో ఒకసారి తెలుసుకుందాం.

కథ.

వైరా వసుంధర (రమ్యకృష్ణ), రాయల్ సత్యం (జయరాం), కొడుకువీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేష్ బాబు), చిన్నతనంలోనే వాళ్ల అమ్మానాన్న లు విడిపోవడంతో రమణ గుంటూరులో అతని మేనత్త బుజ్జి అయినా (ఈశ్వరి రావు) దగ్గర పెరుగుతాడు వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది.

ఆమె తండ్రి వైరా వెంకటస్వామి ప్రకాష్ రాజ్, వసుందరికి పుట్టిన రెండవ భర్త సంతానం ని  రాజకీయాల్లోకి తీసుకురావాలని, దీనికి మొదటి భర్త కొడుకు అయిన రమణ అడ్డుగా మారకూడదని భావించి ఒక ఒప్పందం కుదుర్చుకుని అగ్రిమెంట్ పై సంతకం పెట్టించాలని తన కుట్టిల రాజకీయాన్ని మొదలుపెడతాడు.

తల్లిని అమితంగా ప్రేమించే రమణా మరి ఆ తల్లి కోసం ఆ అగ్రిమెంట్పై సంతకం పెట్టాడా ఇంతకీ అగ్రిమెంట్లో ఏముంటుంది తన తల్లి తండ్రి విడిపోవడానికి గల కారణాలు కొడుకును కూడా ఎందుకు దూరం చేసుకుంటుంది అనే అంశం థియేటర్లలో చూడాల్సిందే.

ఎలా ఉంది అన్న అంశం చర్చిస్తే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రాలు ఆయన కదా డైలాగులు కలకు తగ్గట్టు అవసరమైన పట్టు బలమైన భావోద్వేగాలు మాటల మాంత్రికుడు మ్యాజిక్ చేస్తూ ఉంటాడు సరిగ్గా ఏ సినిమాలో కూడా అదేవిధంగా అలాంటి పాత్రలతో మొదలయ్యే కదే దానికి ఒక కొత్త రకంగా ప్రయత్నం చేశారు కానీ ఈసారి ఆయన ప్రయత్నం గత సినిమాల మాదిరి మెప్పు పొందలేదని అనుకోవాలి, తల్లి కొడుకులు బంధంతో ప్రధానంగా సాగే ఈ కథ ఆదిలోనే తేలిపోయింది తెలిసిన కథ అయినా కొత్తగా చెప్పడం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి నిరాశపరిచాడు పాతికేళ్ల పాటు తల్లికి దూరంగా పెరిగిన కొడుకు సంతకం చేస్తే తెగిపోయే బంధంతో ఆ కథ ముడిపడి ఉంటుంది ఈ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన దర్శకుడు ఆ తర్వాత సినిమాని కాలక్షేప సన్నివేశాలతో నడిపించినట్టే ఉంటుంది చాలా పాత్రలకు సన్నివేశాలకి కథతో ఏమాత్రం సంబంధం లేకుండా సాగుతుంది తల్లి తన కొడుకుని ఎందుకు వదిలి పెట్టాల్సి వచ్చింది అనే విషయం తల్లికి దూరమైన కొడుకు పడిన వేదన ఈ నేపథ్యంలో సంఘర్షణ ఈ సినిమాకి కీలకం కానీ ఇందులో ఆ సంఘర్షణ పైన దర్శకుడు ఆ ఎమోషన్ ని బలంగా సమకూర్చలేకపోయాడు, గుంటూరు  నుంచి హీరో హైదరాబాద్ కి రావడం వెళ్లిపోవడమే పని అన్నట్టుగా ఫస్ట్ అఫ్ ఉంటుంది మధ్యలో కొన్ని ఫైట్లు అక్కడక్కడ చిన్నచిన్న డైలాగులు తప్ప మరే ఇతర సన్నివేశాలు అంత మెప్పించవు, రమణతో సంతకం కోసం మురళీ శర్మ తన కూతురిని రంగంలో దించడం ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఎలాంటి బలాన్ని ఇవ్వలేకపోయాయి శ్రీ లీల వెన్నెల కిషోర్ తో హీరో కాసేపు అలరిస్తాడు.

ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు గత సినిమాల్లో గుర్తుకు వస్తాయి ప్రేక్షకులకు ఒక కొత్త సినిమా చూస్తున్న భావన కనిపించకపోవడం ఈ సినిమా బలహీనత, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తారు కానీ ఈ సినిమా లో అవి కూడా  లోపించాయి, మహేష్ బాబు మాస్ యాక్షన్ పాటలు ఎనర్జిటిక్ నటన కాస్త ఈ సినిమాకి బలం

మహేష్ బాబు పాత్ర ఆయన నటనే ఈ సినిమాకి హైలైట్ అని ఇన్నాళ్ళ తన కెరియర్లో ఇలా డాన్స్ చేయలేదు డైలాగ్ కి తగ్గట్టు ఆయన ఇందులో అదరగొట్టాడు భావోద్వేగాలని ఎమోషన్స్ ని బాగా పండించాడు శ్రీ లీల ఈసారి కూడా డాన్స్ కే పరిమితం అయింది ప్రభుదేవా డూప్లా ఉంది అని హీరో అన్నట్టుగానే ఆమె అదరగొట్టింది ముఖ్యంగా కొచ్చి మడత పెట్టే పాటలో ఆమె మహేష్ బాబు కలిసి చేసిన డాన్స్ సూపర్ మీనాక్షి చౌదరి తన పాత్ర పరిమితమే రమ్యకృష్ణ పాత్ర ఆమె నటన హుందాగా కనిపిస్తాయి ఈశ్వరి రావు పాత్ర డైలాగులు కాస్త శృతిమించినట్టు అనిపిస్తాయి ప్రకాష్ రాజ్ వెన్నెల కిషోర్ పాత్రలో కొత్తదనం ఏమీ లేదు జగపతిబాబు రావు రమేష్ మురళి శర్మ సునీల్ ఇలా చాలామంది నటులు కనిపిస్తారు గాని ఏ పాత్రలోనూ సినిమాకు బలం కనిపించదు, తమన్ మ్యూజిక్ పరవాలేదు అనిపిస్తుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పరవాలేదు అనిపిస్తుంది.

ఇది కేవలం మేము చూసిన కోణంలో మాత్రమే 
ఎవరి దృష్టి కోణం వారిదే గమనించాలి

 Gunturu Kaaram Trailer Review