విజయ్ దేవరకొండ తో రష్మిక స్పెషల్ సాంగ్

Admin

Updated on:

Rasmika And vijay Again Screen Share Family Star Telugu Movie

Family Star Telugu Movie Special Song Update

విజయ్ దేవరకొండ రష్మిక మందన్న సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ తెలుగు ప్రేక్షకులకు హార్ట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ జంట విజయ్ దేవరకొండ నటించే ఫ్యామిలీ స్టార్ లో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది అని సమాచారం, గతంలో వీరిద్దరి జంటగా నటించిన గీతగోవిందం మరియు డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సంగతి మన అందరికీ తెలిసిందే .ముఖ్యంగా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది ,

ఈ అందమైన జంట మరొకసారి తెరపైకి రావడంతో అభిమానులు ప్రేక్షకులు దృష్టిని ఆకర్షిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు

పరశురాం మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తెలుగు సినిమా ఫ్యామిలీ స్టార్, ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం చివరి షెడ్యూల్ పూర్తి చేయడానికి 15 రోజులు యూఎస్ఏ కి చిత్ర బృందంతో వెళ్ళనున్నారు ఈ ఈ షెడ్యూల్లో పుష్ప యానిమల్ వరస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ చిత్రంలో రష్మిక మందన్న ముందే ఎంపికైంది కానీ ముందు సంతకం చేసిన ప్రాజెక్టుల కారణంగా టైం అడ్జస్ట్మెంట్ కాకపోవడంతో ఈ సినిమాకి దూరమైనా ఒక స్పెషల్ సాంగ్ లో అలరించనుంది ఈ పాట చిత్రీకరణ కోసం ముంబైలో ప్రత్యేక సెట్ వేసి మరి ఈ పాటను చిత్రీకరించారు.

మరి రష్మిక కేవలం ఒక పాటలోనే కనిపిస్తుందా లేదా ప్రత్యేక పాత్రలో కూడా కనిపిస్తుందా అనేది సినిమా విడుదల అయ్యేంతవరకు తెలియదు.

ఇంకా ఈ చిత్రం లో విజయ్ సరసన మృనాల్ ఠాగూర్ నటిస్తుండగా ఈ  చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు, ఈ సినిమా కి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు.
 
గతంలో పరశురాం రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన సినిమా గీతగోవిందం ఏ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది మరోసారి హిట్ కాంబినేషన్ జతకట్టడంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.