Family Star Movie Review

Admin

Updated on:

The Family Star Telugu Movie Review

ది ఫ్యామిలీ స్టార్ తెలుగు రివ్యూ

టాలీవుడ్ యంగ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తెలుగు చలనచిత్రం ది ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రానికి దర్శకత్వం పరుశురాం అందించారు.

వేసవి సందర్భంగా  ఫ్యామిలీ ఆడియోస్ ను ఆకట్టుకునేలా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ ఎంతవరకు సక్సెస్ అయిందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే ఒక మామూలు మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి గోవర్ధన్ (విజయ్ దేవరకొండ), విజయ్ ఆర్కిటెక్ ఇంజనీర్ చిన్న ఉద్యోగంతో తన కుటుంబ బండిని అత్యంత పొదుపుతో  బరువు బాధ్యతలు మోస్తాడు ఈ క్రమంలో వాళ్ళ ఇంటి పై అద్దెకు ఉండడానికి ఒక అమ్మాయి వస్తుంది తన పేరు ఇందు (మృణాల్ ఠాకూర్ )అమ్మాయి తన జీవితంలోకి ఎలా వస్తుంది అసలు ఆ అమ్మాయి వచ్చాక తన జీవితం ఏ వైపుకు మారుతుంది అక్కడ ఎదురైనా సంఘటనలు సవాళ్లు మరి ఈ జంట కలుస్తారా లేదా అసలు ఆ అమ్మాయి ఎవరు చివరికి ఈ ఫ్యామిలీ స్టార్ ఏం చేస్తాడు అనేది థియేటర్లలో చూడాల్సిందే.

గీత గోవిందం తర్వాత పరుశురాం మరియు విజయ్ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఈ చిత్రం మొదటి చిత్రంలో లాగే ఫ్యామిలీ మెన్ గా పర్ఫెక్ట్ గా ఆ పాత్రకు విజయ్ సరిపోయాడని చెప్పుకోవాలి అతని టైమింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎదురయ్యే ఇబ్బందులు సవాళ్లు ఆ పాత్రలో వేరియేషన్స్ విజయ్ బాగా నటించాడు ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్  విషయానికి వస్తే తన పాత్ర తన నటన అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటాయి డీసెంట్ లుక్ తో నాచురల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది వీరితోపాటు జగపతిబాబు వెన్నెల కిషోర్ సీనియర్ నటి రోహిణి తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

ఇక మైనస్ పాయింట్స్ ఏమిటి అనుకుంటే,

ఈ చిత్రంలో అనుకూల అంశాలు కంటే ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సింపుల్ కాన్సెప్ట్ అయినప్పటికీ సినిమా కథనంలో మిస్ అవుతుంది ఆల్రెడీ చూసిన సినిమాలాగే కథనం నడుస్తుంది అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మినహా మిగతావన్నీ సాగదీత గా అనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ మరియు సెకండ్ హాఫ్ కూడా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడతాయి అసలు సినిమా మెయిన్ అంశంలోకి వెళ్లడానికి చాలా టైం పడుతుంది అక్కడ మంచి అయిన కథ ఆసక్తిగా ఉంటుందంటే అది కూడా కనిపించదు. సరైన ఎంటర్టైన్మెంట్ లేదు పోనీ భావోద్వేగ పరిచయం కూడా లేవు. ఈ లోపం మొదల నుంచి చివరి వరకు కనిపిస్తుంది.

ఈ చిత్రం నిర్మాణ పరంగా చూస్తే సాంకేతికంగా చాలా బాగుంటుంది ఉన్నతమైన నిర్మాణ విలువలు ఉన్నాయి ఈ చిత్రంలో అవసరానికి తగ్గట్టుగా టెక్నికల్ టీం యావరేజ్ గా ఉంది.

మ్యూజిక్ పరంగా చూస్తే గోపి సుందర్ మ్యూజిక్ కూడా యావరేజ్ గా ఉంది.

ఇక పరుశురాం విషయానికొస్తే తన కెరీర్లో చాలా వి వర్క్ అని చెప్పుకోవచ్చు విజయ్ పాత్రను ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అనేలా ప్లాన్ చేసుకున్నారు కానీ దీనిని ఆవిష్కరించడంలో చాలా డిసప్పాయింట్ చేశాడు మెయిన్ గా తన నుంచి ఉండే ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ నరేష్ ఈ చిత్రంలో బాగా మిస్ అయినట్లు ఉంటుంది అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మినహా సినిమా అంతా బోర్ గా అనిపిస్తుంది.

విజయ్ పరుశురాం కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం తర్వాత వచ్చిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా లేకపోవడం ప్రేక్షకులను నిరాశ కల్పించే అంశం.

 The Family Star Telugu Movie Review