Family Star Movie Madhuramu Kadha Lyrical Song Update

Admin

Updated on:

Madhuramu Kadha Lyrical Song Update

మధురము కదా ప్రతి ఒక్క నడక నీతో కలిసి ఇలా అంటున్న మృనాల్ ఠాకుర్

విజయ్ దేవరకొండ పరశురాం కాంబోలో తెరకెక్కుతున్న రాబోవు తాజా తెలుగు చిత్రం ఫ్యామిలీ స్టార్,

ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ సందర్భంగా మూవీ టీం ఏ సినిమా నుంచి మధురము కదా అనే లిరిక్స్ తో స్టార్ట్ అయ్యే మెలోడీ సాంగ్ విడుదల చేశారు ఈ పాటను శ్రియాఘోషల్ స్వరపరచగా, అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు

ఈ చిత్రానికి సంగీతం గోపీచందర్ అందించారు

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మృనాల్ ఠాకూర్ నటిస్తుంది,రాజు మరియు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

మధురము కదా ప్రతి ఒక్క నడక నీతో కలిసి ఇలా అంటూ సాగే ఈ పాట చాలా మెలోడీస్ గా శ్రోతల్ని అలరిస్తుంది,ఈ పాటలోని తన ప్రియుడిపై ఉన్న భావాలని వ్యక్తపరుస్తూ సాగే పాటగా ఈ పాట ఉంది,

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5 తేదీ 2024 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఈనెల మార్చి 28వ తేదీ విడుదల చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.