Extra Ordinary Man Movie Review

Admin

Updated on:

Nithin Srilela Extra Ordinary Man Review

Extra Ordinay Man Telugu review

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మరియు వక్కంతం వంశీ కాంబినేషన్లో ఈ డిసెంబర్ 8వ తేదీన విడుదల కానున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్,

 ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీ లీల నటిస్తుంది, రావు రమేష్, సంపత్ సుదేవ్ నాయక్, బ్రహ్మాజీ, రోహిణి, హర్షవర్ధన్. శ్రీకాంత్ అయ్యంగర్, పవిత్ర లోకేష్, హరితేజ, జగదీష్, హైపర్ ఆది తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

ఈ సినిమాకి ఆర్థర్  ఎ .విల్సన్ , జె.యువరాజ్ ,సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు.

EXTRA ORDINARY MAN TELUGU REVIEW cinesitralu

ఈ సినిమా శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎం సుధాకర్ రెడ్డి నికిత రెడ్డి నిర్మాతలు , రచన మరియు దర్శకత్వం వక్కంతం వంశీ.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మరియు శ్రీ లీల జంటగా నటించిన సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.
వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు అనగా  డిసెంబర్ 8 2023 విడుదల అయింది.. ఇటీవల వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీగానే పెరిగాయి అంతే అంచనాలతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రేక్షకులకు కన్నుల విందు  చేయడానికి ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. 
ఇటీవల వరుస అపజయాలతో సతమతమవుతున్న నితిన్ కి ఏ సినిమా పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు భీష్మ విజయం తర్వాత నితిన్ కు సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు..
మరి ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఎలా అలరించాడో ఒకసారి చర్చిద్దాం.
కథ
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అభయ్ ABHI (నితిన్) ఒక సాధారణ వ్యక్తి , తను చిన్నప్పటి నుంచి మరో వ్యక్తిల ఉండటం అంటే ఇష్టపడే వ్యక్తిత్వం అతనిని సినిమాల్లో నటించడానికి ప్రేరేపిస్తుంది ఆ వ్యక్తిత్వమే జూనియర్ ఆర్టిస్ట్ గా మారుస్తుంది కానీ తనకు ఎంత ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు గౌరవం దక్కదు. కెమెరా లెన్స్ కు దొరకనంత వెనకగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు అలా ఏదో అరకొర క్యారెక్టర్లు చేస్తూ సాగిపోతున్న అతని జీవితంలోకి లిఖిత శ్రీ లీల ప్రవేశిస్తుంది, ఆమె ఒక పెద్ద కంపెనీకి సీఈఓ గా ఉంటుంది తనతో అబ్బాయి ప్రేమలో పడ్డాక అతని జీవితం పూర్తిగా మారిపోతుంది లిఖిత వాళ్ళ కంపెనీలో సీఈవో స్థాయికి చేరుకుంటాడు అభి సరిగ్గా అదే సమయంలో అతనికి హీరోగా చేసే అవకాశం వస్తుంది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న కోటిగా గ్రామంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ అది అందులోని రావణుడు లాంటి నీరో అలియాస్ నిరంజన్ సుదేవ్ నాయక్ అనే ప్రతి నాయకుడు ఆట కట్టించడానికి సైతాన్ అనే పోలీస్ ఎలాంటి సాహసాలు చేశాడన్నది ఆ కథలో కీలక అంశం ఈ కథ అబ్బాయికి విపరీతంగా నచ్చడంతో తను సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్న తన మనసు మార్చుకొని మళ్లీ ఆ చిత్రం కోసం తాను చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమించిన అమ్మాయిని వదులుకొని వెళ్లిపోతాడు కానీ తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి దర్శకుడు అభిని కాదని మరో హీరోతో ఆ చిత్రం నిర్మించాలని నిర్ణయించుకుంటారు, అదే సమయంలో అభి కి ఒక సంఘటన ఎదురవుతుంది తను విన్న కథలో ప్రతి నాయకుడు నీరుతో నిజంగా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది దీని కోసం తన దొంగ పోలీస్ గా కోటియా గ్రామంలోకి వెళ్లి తన ప్రయత్నాలను మొదలుపెడతాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అక్కడ కోటియా గ్రామ ప్రజల్ని నీరు భారి నుంచి ఎలా రక్షిస్తాడు ఎటువంటి సాహసాలు చేస్తాడు అనేది సినిమాలో చూడాల్సిందే అతను నిజమైన పోలీస్ కాదని తెలుసుకున్న విజయ్ చక్రవర్తి రాజశేఖర్ ఏం చేశాడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్గా ఎలా పేరు తెచ్చుకున్నాడు అనేది కీలక అంశం.
 
 
 
 సినిమాలో ఎక్కువ భాగం కామెడీకి పెద్ద పీఠం వేశారని చెప్పుకోవాలి ట్రైలర్ లో చూపించినట్టు వరుస కామెడీ ట్రాకులు వస్తూనే ఉంటాయి అవి ఒక వంతు వినోదాన్ని అందించిన కూడా సాగుతున్న కథలో విమర్శ లేనప్పుడు ఆ ప్రయత్నం వృధాగానే మారుతుంది అదే జరిగింది ఈ కథకు కూడా అంతేకాకుండా జూనియర్ ఆర్టిస్ట్ గా ఎదగాలనుకున్న సమయంలో వాళ్లు పడే ఇబ్బంది అక్కడున్న పరిస్థితులు ఈ కథలో అర్థం అవుతుంది . ఇలాంటి కథలు తెలుగులో తెరపై చాలానే చూసాం తెలిసిన కథ అయినప్పటికీ కొన్ని టెస్టులు తో వినోదాన్ని జోడించి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారు కథలో బలం ఉన్నప్పటికీ దర్శకుడు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఉత్సాహపరచలేదు అని చెప్పుకోవాలి.
 అంతేకాకుండా ఈ సినిమాలో ఒక మంచి చేజింగ్ సీన్ తో ఒక స్మగ్లర్కు హీరోకు తన కథ చెప్పడంతో అసలు కథ మొదలు అవుతుంది జూనియర్ ఆర్టిస్ట్ గా సెట్ లో అభి ఎదుర్కొనే ఇబ్బందులు ఇంట్లో తండ్రితో పడే చివాట్లు అన్ని ఫన్నీగా ఉంటాయి ఇక అవి జీవితంలోకి కథానాయక ప్రవేశించక సినిమా కాస్త నిమ్మదిస్తుంది వీళ్లిద్దరి ప్రేమ కథలో ఏమాత్రం ఫీల్ కనిపించదు అని చెప్పాలి అయితే హీరోయిన్ ఇంటికి హీరో తొలిసారి వెళ్ళినప్పుడు అక్కడ స్పూఫ్ పాటలతో చేసే అంగమ కడుపుబ్బ నవ్విస్తుంది బాలకృష్ణ చెంప దెబ్బలు అంశం విజయ్ రష్మిక లవ్ టాపిక్ పవిత్ర లోకేష్ అండ్ నరేష్ ప్రేమ అంశం ఇలాంటి Trending ఎలిమెంట్స్ ని కామెడీకి వాడుకున్నారు ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ సెకండాఫ్ పై ఆసక్తి పెంచుతుంది, హీరో దొంగ పోలీస్ గా అవతారం ఎత్తి ఒరిస్సా గ్రామానికి వెళ్లడం అక్కడ ప్రతి నాయకుడు నీరుతో తలపడటం ద్వితీర్థంలో అసలు కథ ప్రారంభమవుతుంది అయితే హీరోగా పేరు తెచ్చుకోవాలని లక్ష్యంతో తనకు అవసరం లేని చోట సమస్య లోకి దూరతాడు కానీ అది అంత కన్వెన్షన్ గా చూపించలేకపోయారు దర్శకుడు సెకండాఫ్లో స్క్రీన్ ప్లే తో ఏదో చేయాలని తాపత్రయంతో అసలు కథను పక్కకు నెట్టినట్టుగా అనిపిస్తుంది రాజశేఖర ఇంట్రడక్షన్ సడన్గా ఎంట్రీ అవుతుంది అది అ సందర్బంగా వచ్చినట్లు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో పోలీసుల తో అల్లరి చేసే ఎపిసోడ్ కామెడీని పండిస్తుంది అక్కడక్కడ కొంచెం పర్లేదు అనిపిస్తుంది ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సీక్వెల్ ట్రెండును అనుసరిస్తూ దీనికి కూడా కొనసాగింపు ఉందంటూ ఆఖరిలో హింట్ ఇచ్చి సినిమాను ముగిస్తారు.

  

ఇంకా నటీనటుల విషయానికి వస్తే జూనియర్ ఆర్టిస్ట్ గా అబ్బాయి అభి నితిన్ తన క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయారు తనికి మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తం ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు భిన్నమైన లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు లిఖిత పాత్రలో శ్రీ లీల అందంగా కనిపించింది కథలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు చిత్రం ఏంటంటే ఈ పాత్ర ఆది కేశవలో తను పోషించిన పాత్రకు చాలా దగ్గరగా ఉంది రాజశేఖర్ ఇందులో కూడా ఐజిగా కీలక పాత్ర పోషించారు తెరపై ఆయన కనిపించినంత సేపు ప్రేక్షకుల్లో ఒక ఊపు కనిపిస్తుంది ప్రతి నాయకుడు నీరో పాత్రలో సుదేవ్ నాయక్ భీకరమైన లుక్స్ తో కనిపించాడు హీరో తండ్రిగా రావు రమేష్ తన సహజ శైలిలో ఒక విభిన్న మేనరిజాన్ని చూపించాడు కామెడీ టైమింగ్ తో నవ్వించారు రోహిణి బ్రహ్మాజీ ఆది సత్య శ్రీ తదితరులు వాళ్ళ క్యారెక్టర్ల పరిధి మేరకు బాగానే నటించారు.
చివరిగా చెప్పాలి అనుకుంటే ఒక్కంతం వంశీ కామెడీ పై పెట్టినంత శ్రద్ధ సినిమా అసలు కథ పై పెట్టలేకపోవడం బాధాకరం సినిమా స్టార్టింగ్ బాగున్నప్పటికీ ముగింపుకు వచ్చేసరికి మొదలైనప్పటికీ ముగింపుకి సంబంధం లేకుండా ముగించారు హరీష్ జయరాజ్ పాటల్లో రెండు పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బానే ఉంది సినిమా సాంకేతిక బాగుంటుంది క్లాసిక్ విజువల్స్ తో నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
 
 
ముఖ్య గమనిక: ఈ సినిమా మేము చూసిన దృష్టి కోణాన్ని బట్టి మా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాం ఎవరిని ఉద్దేశించి కాదు.
 

Nani   Hi Nanna Movie Review

EXTRA ORDINARY MAN TELUGU REVIEW