Exrta Ordinary Man Lirical Song
Nithin Latest SONG Brush VESKO
చిత్రం ;ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.
సాంగ్ :హే మామ బ్రష్ ఏ వేసుకో
నటీనటులు:నితిన్, శ్రీ లీల, పవిత్ర లోకేష్ ,రావు రమేష్ ,సంపత్ రాజ్, హర్షవర్ధన్ ,తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
డైరెక్టర్: వక్కంతం వంశీ
సంగీతం: హరీష్ జయరాజ్
నిర్మాత: సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
బ్యానర్: శ్రేయస్ట్ మూవీ పతాకం అండ్ ఆదిత్య మూవీస్ రుచిరా ఎంటర్టైన్మెంట్స్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ మరియు వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న లేటెస్ట్ టాలీవుడ్ తెలుగు మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.
శ్రేష్ట మూవీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ కూడా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను మరింత ఆసక్తికరంగా చేసింది, ఇప్పటి వరకే ఒక లిరికల్ సాంగ్ విడుదల చేశారు అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది అంతేకాకుండా నితిన్ గతంలో చేసిన చిత్రాలకు మించిన క్రేజ్ అండ్ హైట్ ఈ చిత్రాలకి వస్తుంది.
ఇక తాజా సమాచారం రెండవ సాంగ్ విడుదల చేశారు ఈ సాంగ్ విన్నకుర్రాళ్లనుఉర్రూతలూగిస్తుంది, సంగీత దర్శకుడిగా ఒక ట్రెండ్ సెట్ చేసిన హరీష్ జయరాజ్ ఈ సినిమాకు ట్యూన్స్ అందించారు, ఒక ఫంకీ స్టైల్ లో డిఫరెంట్ గా ఉన్న ఈ సాంగ్కు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.
ఇక సినిమా విడుదలకు దగ్గరవుతున్న సమయంలో ఈ పాట కూడా సినిమాపై మరింత క్రేజ్ కలిగిస్తుంది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అలాగే రుచిరా ఎంటర్టైన్మెంట్స్ సహకారంతో శ్రేయస్ట్ మూవీస్ పతాకం పై సుధాకర్ రెడ్డి నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు మనకు తెలిసినదే ఇక వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకుడిగా ఇది రెండవ సినిమా ఇంతకుముందు అల్లు అర్జున్ NAA PERU SURYA అనే ఒక సినిమా చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా నితిన్ తో చేస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోవాలని ఆసక్తితో ఈ చిత్రానికి మంచి కంటెంట్ చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ పాట విషయానికి వస్తే హే మామ డ్రెస్సే వేసుకో అనే పదంతో మొదలవుతున్న ఈ పాట చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతరానికి సమాజం నుంచి వచ్చే ఫోర్స్ ఎలా ఉంటుందో చెప్పుతున్నట్లు సాగుతుంది ఈ పాట నితిన్ వేసిన స్టెప్పులు కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది ఈ పాట అయితే అందర్నీ ఆకర్షిస్తుంది . త్వరలో విడుదల కానున్న ఈ సినిమా నితిన్ కి మంచి హిట్ అందించాలని కోరుకుందాం.
RELEASE DATE 08-12-2023