tillu 2 Telugu Movie Radhika lyrical video Song release

Admin

Updated on:

Tillu2 intersting Update

కాటుక కళ్ళతోటి కాటే వేసావే రాధిక అంటున్న టిల్లు

అట్లుంటది మనతోనే అని ప్రేక్షకులను అలరించిన సిద్దు జొన్నలగడ్డ మరోసారి మన ముందుకి టిల్లు 2 రాబోతున్నాడు.

డీజే టిల్లు ప్రేక్షకులను ఎంతగా అలరించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక విభిన్న శైలిలో తనకే సొంతమైన స్లాగ్ తో ప్రేక్షకులను  అలరించిన సిద్ధూ జొన్నలగడ్డ మరియు అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో రాబోవు తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ .

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క రాధిక అనే పాట విడుదల చేశారు డీజే టిల్లులో రాధిక అనే పాత్ర ప్రధానం అవ్వడంతో సినిమాకు ఆ పాత్రే చాలా బలం చేకూరింది ఆ పాత్ర పేరుతో ఈ సినిమాలో పాటను విడుదల చేస్తుండడం విశేషం.

రాధిక రాధిక రాధిక అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటను ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు, రామ్ మిర్యాల సిగ్నేచర్ స్టైల్లో రూపొందించబడిన ఈ పాట అతను కంపోజ్ చేయడమే కాకుండా తన ఆత్మీయమైన గాత్రాన్ని కూడా అందించాడు అంతేకాకుండా కస్రాల శ్యాం సాహిత్యం అందించడంతో రాధిక చార్ట్ టాపింగ్ సెన్సేషన్ గా మారడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది నిర్మాత సూర్యదేవర నాగ వంశీ

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహానిర్మాణ సహకారంతో శ్రీకర స్టూడియో కూడా నిర్మాణ భాగస్వాములయ్యారు

 DECEMBER 1 released Animal Movie Review