Devara Telugu Movie latest News

Admin

Updated on:

jr ntr devara

Devara Telugu Movie Latest News

jr ntr devara

Jr NTR Devara Movie New Update

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు లాస్ట్ మూవీ ఆర్ఆర్ ఆర్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఆ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల వ్యవధి గ్యాప్ లో వస్తున్న సినిమా దేవర.

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా దేవర
గతంలో జనతా గ్యారేజ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా పెద్ద హిట్ అందుకుంది
మళ్లీ దానికి మించిన సక్సెస్ కోసం NTR అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ,
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు
ప్రస్తుతం ఈ చిత్రం యొక్క యాక్షన్ సన్నివేశాలు ఇటీవల గోవాలో షూటింగ్ జరుపుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం
లొకేషన్ లో తీసిన స్టిల్ ను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు షేర్ చేశారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్, జాన్వి కపూర్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను కూడా గోవాలో షూట్ చేస్తున్నారంట  ఈ వార్త వినగానే అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది,
ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటులు.
నందమూరి తారక రామారావు, జాన్వి కపూర్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రీదేవి కుమార్తె అయిన జాహ్నవి కపూర్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.


ఈ చిత్రం కథ కథనం ఒక్క మూడు గంటల సినిమాలో పూర్తి అవ్వని కారణంగా పార్ట్ వన్ ,పార్ట్ టు రెండు భాగాలుగా చిత్రిస్తున్నారు
ఈ విషయాన్ని ఇటీవలే సినిమా దర్శకుడైన కొరటాల శివ తెలియజేశారు, ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నాడు,

ఫ్యాన్ ఇండియా అన్ని భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి
దేవర సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుద ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్నారు
ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లో విడుదల చేయడానికి మూవీ టీం నిర్ణయించుకున్నారు
అభిమానులకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ చిత్రం బిగినింగ్ మాత్రమే దీని సీక్వెల్ కూడా ఉంటుంది…

Devara Movie Teaser