Chiranjeevi 157 vishwambhara Telugu Movie shooting AT Maredumilli
మెగా@157 షూటింగ్ మొదలు
టాలీవుడ్ అగ్ర నటులలో ఒక్కరైనా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రాబోవు తాజా చిత్రం విశ్వంభర ఈ చిత్రానికి బింబిసారా ఫేమ్ దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం.
ఈ చిత్రానికి వశిష్ట భారీ సెట్స్ వేయిస్తున్నట్లు సమాచారం.
మెగాస్టార్ శివ ఫాంటసీ చిత్రం విశ్వంభరా, ఈనెల నవంబర్ 22న మారేడుమిల్లిలో షూటింగ్ ప్రారంభమైంది డిసెంబర్ 5 వరకు కొనసాగుతుంది డిసెంబర్ 20 తర్వాత రెండవ షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది, జనవరిలో మెగాస్టార్ చిరంజీవి సెట్స్ పైకి వెళ్తారని సమాచారం,
ఇటీవల విడుదలైన మెగా @ 157 కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది మరియు ఇది సినిమా కాన్సెప్ట్ను వివరిస్తుంది ఇప్పుడు మెగాస్టార్ వయస్సు కు తగ్గ పాత్రలో కనిపిస్తారని దర్శకుడు ధ్రువీకరించారు,
ఈ సినిమాలో కథానాయకగా ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు ప్రస్తుతం మూవీ టీం ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు విఎఫ్ఎక్స్ పనులతో బిజీగా ఉంది,
యు వి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు