Animal Movie Telugu Review

Admin

Updated on:

Animal Movie Telugu Review

Ranbir Kapoor Animal Movie Review

చిత్రం: యానిమల్

 నటులు :రన్బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రి, పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా ,సురేష్ ఒబెరాయ్, రవి గుప్తా, సిద్ధాంతకర్ణిక్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.

సంగీతం: విశాల్ మిశ్రా, జానీ, మనన్ ,భరద్వాజ్ శ్రేయస్ పురానిక్, అషిం కెమ్స్ న్

 

 నేపద్య సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
రచన ,స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం :సందీప్ రెడ్డి వంగ
సంస్థ: టీ సిరీస్ ఫీలింగ్స్ ,భద్రకాళి పిక్చర్స్, సినీవన్
రిలీజ్ డేట్: 01-12-2023
 
 
 
అర్జున్ రెడ్డి తో సెన్సేషనల్ సృష్టించిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం తన పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతుంది, 
బాలీవుడ్ రొమాంటిక్ బాయ్ రన్బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరపైకి వచ్చిన చిత్రం యానిమల్.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డిసెంబర్ 1 2023 తేదీన 4000 స్క్రీన్ లో అత్యధికంగా రిలీజ్ అయింది.
దీనికి సంబంధించి కథనం ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది అనే అంశాలు చర్చిద్దాం.
 
కథ ఏంటి అంటే మనకు ట్రైలర్లో చూపెట్టిన సింబల్ స్వస్తిక్ అది ఒక స్టీల్ కంపెనీ దాని అధినేత దేశంలోనే అత్యంత సంపన్నుడైన బల్బీర్ సింగ్( అనిల్ కపూర్ )తనయుడు   రన్ విజయ్( రన్బీర్ కపూర్)
  ఎవరినైనా సరే ధైర్యంగా ఎదిరించే సత్తా ఉన్నోడు. అతని చిన్నతనం నుంచే తన తండ్రి అంటే చెప్పలేనంత ప్రేమ కానీ తన తండ్రి వ్యాపారాలలో బిజీగా గడుపుతూ కొడుకును పట్టించుకునే అంత సమయం ఉండకపోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం వస్తుంది ,దూకుడు మనస్తత్వం ఉన్న విజయ్ పనులు అతని తండ్రి బల్బీర్ సింగ్ కి నచ్చవు ,ఆ విధంగా ఇద్దరు మధ్య గొడవలు మొదలవుతాయి, దాంతో విజయ్ ప్రేమించిన గీతాంజలి (రష్మిక మందన్న )నీ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాడు.
 కొన్ని సంవత్సరాల తర్వాత విజయ్ ఎంతగానో ప్రేమించే తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తెలియడంతో హుటాహుటిన తన భార్య పిల్లలతో ఇండియాకి వస్తాడు వచ్చాక ఏం జరిగింది తన తండ్రి ని హత్య చేయాలనుకున్న శత్రువు ఎవరు విజయ్ అతనిని ఎలా గుర్తిస్తాడు ఇంతకీ ఆ శత్రువు నుంచి అతని కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేదే ఈ సినిమా థియేటర్లలో చూడాల్సిందే.
 
 
 ప్రధానంగా చెప్పాలి అంటే తండ్రి కొడుకుల మధ్య జరిగే ప్రేమ కథ ఇది దీనిని కాస్త ఘాటుగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా అర్జున్ రెడ్డి పాత్రను సృష్టించిన సందీప్ రెడ్డి ఇంచుమించు అదే విధంగా అటువంటి ఆలోచనలు ఉన్న కథానాయకుడిని తండ్రి కొడుకుల కథలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఈ చిత్రం. 
కథ రొటీన్ అయినప్పటికీ ఇటువంటి భావోద్వేగాలు  కాస్త కొత్తగా ఆలోచింపచేస్తాయి సినిమా వస్తున్నప్పుడు పాత సినిమాలు కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి కానీ సందీప్ రెడ్డి వంగ తన మార్క్ రచనతో సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చాడు ముఖ్యంగా కథానాయకుడు పాత్ర సంఘర్షణ మాటలు చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి తండ్రి పై అంతులేని ప్రేమ ఉన్న కొడుకు పూర్తి జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది కదా చిన్నదే అయినప్పటికీ హీరో బాల్యం అతని ప్రేమ సన్నివేశాలతో కథ ముందుకు నడిపించారు అతని సోదరి ని కాలేజీలో ర్యాగింగ్ చేశారని అక్కడికి వెళ్లి చేసిన హంగామా సినిమాలో ఉత్సాహాన్ని తీసుకొస్తుంది ఆ ఎపిసోడ్ తో పాటు చాలా సన్నివేశాలు అర్జున్ రెడ్డి సినిమాను గుర్తుచేస్తాయి.
 
 హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ ఆసక్తికరంగా మొదలుపెట్టిన దర్శకుడు భార్యాభర్తలుగా వాళ్ల ప్రయాణాన్ని చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది కథానాయకుడు అమెరికా నుంచి వచ్చాక సంఘర్షణ మొదలవుతుంది బల్బీర్ సింగ్ పై అత్యాయత్నం తర్వాత అసలు కథ మొదలవుతుంది తన తండ్రికి ప్రాణాపాయం ఉందని తెలిసిన విజయ్ తనకు ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఆ నేపథ్యంలో పండిన భావోద్వేగాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ బలం మనిషిని పోలిన మనిషిని కథలోకి తీసుకొచ్చే అంశాన్ని సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది విరామం ముందు వచ్చే యాక్షన్ సీన్స్ సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి ఇక ప్రతి యాక్షన్ సినిమాలో లాగే ఇక్కడ కూడా బుల్లెట్ల వర్షం కురుస్తూ సాగే కొన్ని సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకి మంచి కిక్కునందిస్తాయి ఫస్ట్ ఆఫ్ అంతా బాగానే ఉంది.
 
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే తన తండ్రిని చంపాలనుకున్నది ఎవరు? ఆ శత్రువుని కనిపెట్టడం అతన్ని అంతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది కొంచెం వైలెన్స్ ఎక్కువే ఉందని చెప్పాలి కొన్ని అసభ్యకరమైన అహాభావాలు వినలేని సంభాషణలు ప్రేక్షకులకు ఇబ్బంది పెడతాయి హీరో హీరోయిన్ల మధ్య లైట్లు తొలిరాత్రి హోటల్లో చొరబడిన 300 మందిని మిషన్ తో కాల్చి చంపడం వంటి సన్నివేశాలు సినిమాటిక్ ప్రయత్ని అయినా మరి ఓవర్గా అనిపిస్తుంది హీరో విజయ్ వేరే ఒక అమ్మాయి తో కలిసి రొమాన్స్ చేశాడు అని హీరోయిన్ కి తెలిశాక వాళ్ళిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు బ్లాక్ చేసినట్టు అనిపిస్తాయి హై వోల్టేజ్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం తండ్రి కొడుకుల మధ్య జరిగే డ్రామా వాళ్ళిద్దరి మధ్య నీవేషంతోనే కథ ముగింపు నివ్వడం సినిమాకి బలం.
ఆ సన్నివేశాలలో బలమైన ఎమోషన్ ని భావోద్వేగాలని అందించడంలో దర్శకుడు సఫలమయ్యారు అని చెప్పాలి తెలిసిన కథ అయినా నేటితరం ప్రేక్షకులకు తగ్గట్టుగా కొత్త విధానంలో చూపించారు ఈ సినిమా రెండో భాగం ఉన్నట్టుగా కూడా కొనసాగింపు అంశాన్ని వదిలారు తదుపరిభాగంపై అంచనాలను కూడా భారీగానే ఉంటాయి అనుకోవాలి.
మొత్తంగా చెప్పాలి అంటే రణ్బీర్ కపూర్ రౌద్రంలో తన నటన ఈ చిత్రానికి చాలా పెద్ద బలం ఒక ప్రత్యేకమైన నడవడికతో కూడిన పాత్ర తనది ఆయన కెరియర్ లో గుర్తుండిపోయేలా ఉంటుంది విభిన్న కోనాల్లో కనిపిస్తూ వాటి మధ్య అంతే వైవిధ్యం ప్రదర్శిస్తూ ఆయన ఈ పాత్రలో ఒదిగిపోయారు అలాగే రన్బీర్ కపూర్ అనిల్ కపూర్ రష్మిక మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం అనిల్ కపూర్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి తన కొడుకుకు ఇవ్వాలనుకున్న ఒక తండ్రిగా ఆయన కనిపిస్తారు తన కొడుకుకు సమయం ఇవ్వ ఇక పోయాననే పశ్చాత్తాపంతో కనిపిస్తూ ఒక తండ్రి పడే బాధ పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోయిన్ రష్మిక మందన్న కూడా బలమైన పాత్రలో కనిపించింది ప్రేయసిగా భార్యగా ఇద్దరు పిల్లల తల్లిగా అందంగా కనిపిస్తూనే నటనకు ప్రాధాన్య మున్న సన్నివేశా తో కట్టిపడేసింది బాబీ డియోల్ కనిపించే కొద్దిసేపైనా ఆయన సినిమాపై చాలా ఇంపాక్ట్ చూపిస్తారు తృప్తి డిమ్రీ పాత్ర కథలో కీలక మలుపునకు కారణం అవుతుంది శక్తి కపూర్ పృథ్వీరాజ్ సిద్ధార్థ కార్మిక తదితరుల పాత్రలు పరిధి మేరకు నటించారు, ఇంకా ఈ సినిమాకు సాంకేతికంగా టెక్నికల్ గా అన్నింటిలోనూ ఉన్నతంగా ఉంది.
హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ధియేటర్ నుంచి ప్రేక్షకులు బయటికి వచ్చిన కూడా వెంటాడుతూనే ఉంటుంది పూనకాలు తెప్పించాడు భావోద్వేగాలని పండించడంలో ఆయన సంగీత పాత్ర కూడా చాలా పండింది
పందిప్ రెడ్డి వంగ రచన దర్శకత్వం ఎడిటింగ్ అన్ని తనదైన శైలిలో బాగున్నాయి సినిమా నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకుడి ఇబ్బంది ఫీలవ్వడనే చెప్పుకోవాలి నిర్మాణం ఉన్నతంగా ఉంది
ఈ సినిమాకి బలహీనతలు చెప్పుకోవాలి అనుకుంటే హింసాత్మక సన్నివేశాలు కొన్ని సంభాషణలు
 
ముఖ్య గమనిక ఇది పూర్తిగా మేము చూసిన విధానం మాకు అర్థమైన విధానంలో మాకు అనిపించిన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే