Animal Movie 1st DAY Collection

Admin

Updated on:

Animal Day 1 world Wide Collection

ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలలో మంచి ఓపెనింగ్స్ అందుకున్న మూడవ చిత్రంగా యానిమల్

సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్లో విడుదలైన చిత్రం యానిమల్కు ప్రేక్షకులు నుండి అభిమానుల నుండి మంచి స్పందన లభించింది ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు అనుకున్న అంచనాలను మించి పోయింది మరియు ఇండస్ట్రీ సమాచారం ప్రకారం భారతదేశము నుండి అత్యధికంగా 65 కోట్లు వసూలు చేసింది అని సమాచారం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు ఓపెనింగ్ వస్తుంది అని అంచనా విడుదలైన మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలలో ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలలో ఉన్నతమైన మైలురాయిని దాటిన మూడవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.

మొదటి రోజు మార్నింగ్ షో మరియు మధ్యాహ్నం షో 46 నుంచి 54 వరకు ఆక్యుపెన్సి ని నివేదించాయి ఇదే చిత్రం తెలుగు లో 70 నుంచి 80 శాతం ఆక్యుఫెన్సీ కొన్నిచోట్ల 90 కొన్నిచోట్ల 100% ఆక్యుపెన్సిని నమోదు చేశాయి ఒక బాలీవుడ్ చిత్రానికి ఇంత అశేష ఆదరణ రావడం ఆసక్తికరమైన అంశం

ఇంకా పాన్ ఇండియా మొత్తం విడుదలైన ఈ చిత్రం తొలిరోజు మంచి ఓపెనింగ్స్ తో ముందుకు వెళుతుంది రణబీర్ కపూర్ కెరీర్లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోతుందని ఆశిద్దాం.