Animal 4Days collection

Admin

Updated on:

ANIMAL

బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న యానిమల్ కలెక్షన్స్

అత్యధిక వసూళ్ల సినిమాల జాబితాలో చేరిన యానిమల్

యానిమల్ మూవీ ట్రైలర్ విడుదలైన రోజు నుండి ఎవరి నోట చూసిన యానిమల్ గురించే… అత్యధిక సెర్చ్ ట్రెండ్ లో కూడా రికార్డ్ సృష్టిస్తున్న యానిమల్.. అత్యంత భారీ అంచనాలతో ఈ నెల డిసెంబర్ 23 తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని అత్యధిక వస్తువుల సినిమాల జాబితాలో చేరింది.

సందీప్ రెడ్డి వంగ రన్బీర్ కపూర్ కాంబినేషన్లో ఈనెల రెండవ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా యానిమల్ . అయితే తాజా లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూలు చేసింది హీరో రన్బీర్ కపూర్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందించిన మూవీగా కూడా నిలిచింది.

రన్బీర్ కపూర్ యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 425 కోట్లు క్రాస్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం

ఈ సినిమా విడుదలైన రోజు కంటే తదుపరి రెండు రోజులు ఎక్కువ కలెక్షన్స్ చేయడం విశేషం. నాలుగో రోజు అయినటువంటి సోమవారం వర్కింగ్ రోజు అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 40 కోట్లు వసూలు చేయడం కూడా ఆసక్తికరమైన అంశం ఇంకా ఈ వారాంతం వరకు ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే.

రన్బీర్ కపూర్ రష్మిక మందన్న అనిల్ కపూర్ బాబి డియోల్ త్రిప్తి డీమ్రీ  శక్తి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు

ఈ సినిమా ..  స్క్రీన్ ప్లే దర్శకత్వం అండ్ ఎడిటర్ సందీప్ రెడ్డి వంగ

నిర్మాణం: టి సిరీస్, సినీవన్ స్టూడియోస్ ,కార్స్ ఆన్ ఫిలిమ్స్ ,భద్రకాళి పిక్చర్స్