అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ

Admin

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూ

సుహాస్ ఎంచుకున్న మరో చక్కని పాత్ర

చిత్రం: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్

 

నటులు: సుహాస్, శివాని నగారం, గోపరాజు ,రమణ ,స్వర్ణకాంత్, నితిన్ ప్రసన్న, వినయ్ మాధవ్, జదీప్ ప్రతాప్, శరణ్య ప్రదీప్

సంగీతం: శేఖర్ చంద్ర

రచన :దర్శకత్వం దుష్యంత్

నిర్మాత: ధీరజ్ మిగిలినేని బన్నీ వాస్ వెంకటేష్ మహా సంయుక్త నిర్మాణం

 

యువ కథానాయకుడు నటుడు సుహాస్ కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల మదిలో నిలిచాడు

సుహాస్ నటించిన మూడవ చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం

 

కథ:

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గ్రూపులో ఒక మెంబర్ అయిన మళ్లీ సుహాస్ చిరుతపుడి అనే గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు తనకు తన సోదరి పద్మ శరణ్య ప్రదీప్ అదే ఊరిలో స్కూల్లో ఉపాధ్యాయ బాధ్యతలు నిర్వహిస్తుంటుంది వెంకట్ బాబు నితిన్ ప్రసన్న, వెంకట్ సహకారం వల్లే తనకు ఈ ఉద్యోగం వచ్చింది అని వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం కొనసాగుతుంది అని పుకార్లు పుట్టిస్తారు ఇంతలో వెంకట్ బాబు చెల్లెలు లక్ష్మి శివాని నాగారం మళ్లీ ప్రేమలో పడుతుంది వెంకట్ బాబు తమ్ముడికి మల్లికి మధ్య చిన్నగా గొడవవుతుంది ఆ గొడవ కాస్త పెద్దది అవుతుంది మరోపక్క పద్మ కి వెంకట్ కి మధ్య వైరం మొదలవుతుంది ఇదిలా ఉంటే మళ్లీ లక్ష్మయ్య ప్రేమ వ్యవహారం కూడా వెంకట్ కు తెలుస్తుంది, దీంతో ఆ కుటుంబంపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని ఒకరోజు వెంకట్ బాబు రాత్రి వేళలో పద్మిని స్కూల్ కి పిలిపించి అవమానిస్తాడు ఆ తర్వాతే ఏం జరిగింది మళ్లీ లక్ష్మీల ప్రేమ కథ ఎటు దారి తీసింది  తదితర అంశాలు  థియేటర్లలో చూడాల్సిందే .

 

కథనం

ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పరువు ప్రేమ నేపథ్యంలో సాగే సినిమాల కోవలోకి చెందిన సినిమా ఇది కూడా.. నాచురల్ గా తెరపై ఆవిష్కరించే కదలని ఎంచుకోవడం ఈమధ్య ఒక ట్రెండ్ గా మారింది కొన్ని విజయాలు కూడా అందుకున్నారు ఈ సినిమా కూడా అలాంటి ప్రయత్నమే అని చెప్పాలి

ఒక అబ్బాయి అమ్మాయి మధ్య జరిగే ప్రేమ ఈ కథకి ముఖ్యం కాదు ఇది ఒక ఆత్మ అభిమానానికి సంబంధించిన కథ అని చెప్పాలి మళ్లీ లక్ష్మీ ప్రేమ కథతో మొదలయ్యే కదా ప్రారంభమైన కొద్దిసేపటికి  ప్రతి ప్రేక్షకుడిని చిరుతపుడి అనే గ్రామానికి తీసుకువెళ్తుంది అనేలా అనిపిస్తుంది. అంత సహజంగా ఉన్నాయి పాత్రలు సన్నివేశాలు నేటివిటీ ఒక సినిమాల అనిపించకుండా మన మధ్య జరుగుతున్న ఒక కథలా అనిపిస్తుంది. 2007లో జరిగే కథ అప్పుడే మొబైల్ అంటే తెలియని కాలంలో ప్రేమ లేఖల తో ఆనాటి ప్రేమికులు పడే తపన సహజంగా చిత్రీకరించారు మరోవైపు కులాల మధ్య అంతరాల్ని టచ్ చేస్తూ ఆర్థిక అసమానతల్ని చూపిస్తూ కథలో ఇన్వాల్వ్ చేశారు.

ఈ సినిమా అప్పటి ప్రేమ కథతో సాగుతుంది సరదాగా కానీ విరామం ముందు కథ మరో మలుపు తీసుకుంటుంది  విరామం ముందు నుంచి ఈ ఈ కథ ఆత్మాభిమానం ప్రధాన అంశంగా మారుతుంది

ఇంటర్వెల్ తర్వాత మళ్లీ అతని కుటుంబం చేసే పోరాటం చుట్టూ సాగుతుంది కదా ఊహకు తగ్గట్టుగానే సాగుతున్న బలమైన సన్నివేశాలతో డ్రామాతో మంచి ప్రభావం చూపిస్తుంది పోలీస్ స్టేషన్లో సాగే సన్నివేశాలు ప్రేమ ప్రాణాల మీదకు తేకూడదు అంటూ మళ్ళీ లక్ష్మీ తీసుకునే నిర్ణయం అనే పద్యంలో పండే భావోద్వేగాలు ఈ చిత్రానికి బలమైన సన్నివేశాలు

ముఖ్యంగా ఈ చిత్రం ఎలా ఉంటుందంటే ఒక సినిమాలో నటులు నటిస్తున్నట్లుగా కనిపించకుండా చాలా సహజంగా మన ముందు జరుగుతున్న పాత్రలలో కనిపిస్తుంది. ఆయా పాత్రలో నటులు చాలా చక్కగా ఒదిగిపోయారు సుహాస్ కి ఈ పాత్ర సరైన ఎంపిక చెప్పాలి. ఎమోషన్స్ తో కూడిన సన్నివేశాలు అతడు చాలా అద్భుతంగా నటించాడు మనసుల్ని హత్తుకునే లా ఉంటుంది సుహాస్ పాత్ర,శివాని నాగారం లక్ష్మీ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది, శరణ్య ప్రదీప్ పాత్ర కూడా ఈ సినిమాకు కీలకం ఆమె పాత్ర కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది ప్రతి నాయకుడి పాత్రల్లో అన్నదమ్ములుగా నటించిన నితిన్ వినయ్ మహదేవ్ కి స్నేహితుడిగా కనిపించే జగదీష్ బండారి పాత్రలు కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి

సాంకేతిక విభాగాలు మంచి పనితీరును ఘనపరిచాయి సంగీతం నేపథ్య సంగీతం కెమెరా ఎడిటింగ్ స్టోరీ రైటింగ్ అన్ని ఈ చిత్రానికి బలమైన ఆకర్షణ

కొత్త కథ కానప్పటికీ ఈ చిత్రాన్ని మలిచిన తీరు చాలా అద్భుతంగా ఉంది సహజంగా సాగే పాత్రలు సన్నివేశాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిద్దాం

 
 
ముఖ్య గమనిక: ఇది కేవలం మేము చూసిన దృష్టి కోణంలోంచి చెబుతున్న సమీక్ష దయచేసి గమనించాలి ఎవరి దృష్టి కోణం వారిదే